Walnut Oil: వాల్నట్‌ ఆయిల్‌తో ఎన్ని హెల్త్ బెనిఫిట్సో తెలిస్తే షాక్ అవుతారు!

వాల్నట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే వాల్నట్స్ వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకున్నాం. ప్రతి రోజూ వాల్నట్స్ తినడం వల్ల పలు దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. అదే విధంగా వాల్నట్ ఆయిల్‌తో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆయిల్ వల్ల శరీరానికి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అంటున్నారు. ఇందులో వివిధ రకాల పోషకాలు ఉన్నాయి. ఈ వాల్నట్ ఆయిల్‌లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్..

Walnut Oil: వాల్నట్‌ ఆయిల్‌తో ఎన్ని హెల్త్ బెనిఫిట్సో తెలిస్తే షాక్ అవుతారు!
Walnut Oil

Updated on: Feb 26, 2024 | 5:56 PM

వాల్నట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే వాల్నట్స్ వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకున్నాం. ప్రతి రోజూ వాల్నట్స్ తినడం వల్ల పలు దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. అదే విధంగా వాల్నట్ ఆయిల్‌తో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆయిల్ వల్ల శరీరానికి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అంటున్నారు. ఇందులో వివిధ రకాల పోషకాలు ఉన్నాయి. ఈ వాల్నట్ ఆయిల్‌లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా లభ్యమవుతాయి. ముఖ్యంగా ఈ వాల్నట్స్‌ ఆయిల్‌తో చర్మానికి, జుట్టుకు సంబంధించి అనేక సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.

గుండె ఆరోగ్యం మెరుగు:

వాల్నట్ ఆయిల్‌తో గుండె సమస్యల్ని తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. దీంతో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అలాగే వాల్నట్ ఆయిల్‌తో రక్త పోటు కూడా అదుపులో ఉంటుంది.

డయాబెటీస్, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:

వాల్నట్‌ ఆయిల్‌ను షుగర్ పేషెంట్స్ ఎలాంటి సందేహం లేకుండా ఉపయోగించవచ్చు. రక్తంలో షుగర్ లెవల్స్‌‌ను నియంత్రించడంలో వాల్నట్ ఆయిల్ చక్కగా పని చేస్తుంది. అదే విధంగా శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా.. కణాలు దెబ్బ తినకుండా కాపాడుతుంది. దీని వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి:

వాల్నట్‌ ఆయిల్‌లో మెగ్నీషియం, క్యాల్షియం ఉంటాయి కాబట్టి.. ఎముకలను బలంగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. అంతే కాకుండా జీర్ణ క్రియను మెరుగు పరచడంలో, మల బద్ధకాన్ని నివారించడంలో కూడా వాల్నట్ ఆయిల్ సహాయ పడుతుంది.

చర్మ సమస్యలకు చెక్ పెడుతుంది:

వాల్నట్ ఆయిల్‌తో చర్మ సమస్యలను నయం చేసుకోవచ్చు. వాల్నట్ ఉపయోగం వల్ల చర్మం సాఫ్ట్‌గా, హైడ్రేట్‌గా, కాంతి వంతంగా ఉంటుంది. ముడతలు, గీతలను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం కణాలు దెబ్బతినడకుండా కాపాడతాయి. వృద్ధాప్య ప్రక్రియను మందగిస్తుంది.

జుట్టు పెరుగుతుంది:

జుట్టు పెరగాలి అనుకునేవారు వాల్నట్ ఆయిల్‌ను ఉపయోగించవచ్చు. ఆ ఆయిల్ వాడటం వల్ల హెయిర్ రాలడం తగ్గడమే కాకుండా.. పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.