ఇంగువ అంటే దాదాపు అందరికీ తెలుసు. దీని గురించి సపరేట్‌గా పరిచయాలు అవసరం లేదు. పూర్వం నుంచి కూడా వంటల్లో ఇంగువను ఉపయోగిస్తూ ఉంటున్నారు. వంటల్లో ఇంగువను వేయడం వల్ల మంచి రుచి, సువాసన వస్తుంది. అంతే కాదు ఇంగువ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంగువను ఆయుర్వేదంలో కూడా పలు రకాల రోగాలు నయం చేయడానికి ఔషధంగా ఉపయోగిస్తూ ఉంటారు. దీన్ని ఆసఫోటిడా, హింగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కేవలం రుచి కోసమే ఇంగువను ఉపయోగిస్తున్నాం అనుకుంటారు. నిజానికి ఇంగువతో అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇంగువ తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలకు బైబై చెప్పొచ్చో ఇప్పుడు చూద్దాం.
చాలా మంది జీర్ణ వ్యవస్థకు సంబంధించి అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. జీర్ణ శక్తిని మెరుగు పరచడంలో ఇంగువ ఎంతో హెల్ప్ చేస్తుంది. ఇది తీసుకోవడం వల్ల పొట్టలో ఉండే అసౌకర్యం తగ్గుతుంది. కడుపులో నొప్పి, ఉబ్బరం, అజీర్తి, గ్యాస్ వంటివి తగ్గుతాయి. పొట్ట ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.
చాలా మందికి శరీరంలో వేడితో ఇబ్బంది పడుతూ ఉంటారు. అందులోనూ వేసవి కాలంలో ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. అలాంటివారు ఇంగువను తీసుకుంటే ఈ సమస్య అదుపులోకి అవుతుంది. అలాగే ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధ పడేవారు దీన్ని తీసుకుంటే చక్కటి ఉపశమనం కలుగుతుంది.
ఇంగువను తీసుకోవడం వల్ల రక్త పోటు తగ్గుతుంది. బ్లడ్ ప్లజర్ లెవల్స్‌ను ఇంగువ అదుపు చేస్తుంది. ఇంగువను తీసుకోవడం వల్ల శ్లేష్మం, దగ్గు, కఫం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే శ్వాస సంబంధిత సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. ఇంగువను తరచూ తీసుకోవడం వల్ల నెలసరి సమయంలో స్త్రీలలో వచ్చే నొప్పి కూడా తగ్గుతుంది.
ఇంగువ తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీంతో బ్యాక్టీరియా, వైరస్‌ల వల్ల కలిగే ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు.
ఇంగువ తీసుకుంటే చర్మ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. మొటిమలు, తామర, గజ్జి వంటి చర్మ సమస్యలు ఉన్నవారు ఇంగువను వాడితే మంచి రిలీఫ్ ఉంటుంది. అంతే కాకుండా లైంగిక సామర్థ్యం కూడా మెరుగు పడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.