Garam Masala: గరం మసాలా తింటే శరీరంలో జరిగేది ఇదే..

|

Jul 07, 2024 | 3:25 PM

ఏ కూరలో అయినా గరం మసాలా వేస్తే ఆ రుచే వేరు. అప్పటి వరకూ ఉన్న టేస్టు మొత్తం మారిపోతుంది. ఇంట్లోనే కాకుండా.. చుట్టు పక్కల మొత్తం మంచి సువాసన వస్తుంది. వెజ్ అండ్ నాన్ వెజ్ దాదాపు అన్ని రకాల వంటల్లో కూడా గరం మసాలాను ఉపయోగిస్తాం. కొంత మంది ఇంట్లో తయారు చేసిన గరం మాసాలా ఉపయోగిస్తే.. మరికొందరు మాత్రం మార్కెట్లో కొన్నవి ఉపయోగిస్తారు. ఏది వాడినా.. కూర రుచులు మారిపోవడం మాత్రం పక్కా. అయితే గరం మసాలా ఎక్కువగా తీసుకోకూడదని..

Garam Masala: గరం మసాలా తింటే శరీరంలో జరిగేది ఇదే..
Garam Masala
Follow us on

ఏ కూరలో అయినా గరం మసాలా వేస్తే ఆ రుచే వేరు. అప్పటి వరకూ ఉన్న టేస్టు మొత్తం మారిపోతుంది. ఇంట్లోనే కాకుండా.. చుట్టు పక్కల మొత్తం మంచి సువాసన వస్తుంది. వెజ్ అండ్ నాన్ వెజ్ దాదాపు అన్ని రకాల వంటల్లో కూడా గరం మసాలాను ఉపయోగిస్తాం. కొంత మంది ఇంట్లో తయారు చేసిన గరం మాసాలా ఉపయోగిస్తే.. మరికొందరు మాత్రం మార్కెట్లో కొన్నవి ఉపయోగిస్తారు. ఏది వాడినా.. కూర రుచులు మారిపోవడం మాత్రం పక్కా. అయితే గరం మసాలా ఎక్కువగా తీసుకోకూడదని.. ఆరోగ్యానికి అస్సలు మంచి కాదని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ గరం మాసాలా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గరం మసాలాలో ఉండేవి అన్నీ ఆరోగ్యకరమైన పదార్థాలే. కాబట్టి ఆరోగ్యానికి ఎలాంటి నష్టం ఉండదు. అయితే లిమిట్‌గా తీసుకోవాలి.

జీర్ణ క్రియ ఆరోగ్యం:

గరం మసాలా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా పని చేస్తుంది. పిత్తుల సమస్యలు ఉన్నవారు గరం మాసాలా తింటే.. ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. కడుపులో గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మల బద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్లు అధికం:

గరం మసాలాలో అనేక రకాలైన పోషకాలు కూడా ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి గరం మసాలా తీసుకుంటే.. సగం వ్యాధులను తగ్గించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:

గరం మసాలా తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది మెండుగా పెరుగుతుంది. దీని వల్ల సీజనల్ వ్యాధులు అనేవి దరి చేరకుండా ఉండొచ్చు. జలుబు, దగ్గు, జ్వరం, అలసట వంటివి తగ్గుతాయి. వైరల్, బ్యాక్టీరియాలతో పోరాడే శక్తి లభిస్తుంది.

వెయిట్ లాస్ అవుతారు:

గరం మసాలా తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు. గరం మసాలా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకు పోయిన చెడు కొలెస్ట్రాల్ అనేది కరుగుతుంది. జీర్ణ సమస్యలు కూడా ఉండవు. కాబట్టి మీరు ఈజీగా బరువు తగ్గుతారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..