AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jaggery Rice: బెల్లం రైస్‌ మీకూ ఇష్టమా? ఇది ఆరోగ్యానికి మంచిదేనా..

స్వీట్లను ఇష్టపడేవారికి బెల్లం రైస్‌ తెలిసే ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టం తింటుంటారు. ఇది నోటికి తియ్యగా ఉండటమే కాకుండా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు . ప్రతిరోజూ భోజనం తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను నోటిలో వేసుకుంటే, జీర్ణ సమస్యలు..

Jaggery Rice: బెల్లం రైస్‌ మీకూ ఇష్టమా? ఇది ఆరోగ్యానికి మంచిదేనా..
Jaggery Rice
Srilakshmi C
|

Updated on: May 12, 2025 | 1:45 PM

Share

స్వీట్లంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. కానీ బయటి నుంచి తీసుకు వచ్చే స్వీట్లు పదే పదే తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ముఖ్యంగా స్వీట్లను ఇష్టపడేవారికి బెల్లం రైస్‌ తెలిసే ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టం తింటుంటారు. ఇది నోటికి తియ్యగా ఉండటమే కాకుండా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు . ప్రతిరోజూ భోజనం తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను నోటిలో వేసుకుంటే, జీర్ణ సమస్యలు సహా శరీరంలోని అనేక వ్యాధులను నయం చేయవచ్చని చెబుతున్నారు. లేదంటే బెల్లంతో తయారుచేసిన బెల్లం రైస్ తినడం వల్ల కూడా అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

బెల్లం రైస్ సాధారణంగా బెల్లం, బియ్యం, చావల్ బాత్, గుర్ వీల్ చావల్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఇది బెల్లం, బియ్యం మిశ్రమం. నచ్చితే డ్రై ఫ్రూట్స్, ఏలకుల పొడి, కొద్దిగా ఉప్పు కూడా వేయవచ్చు. ఇది చాలా సులభమైన, సులువైన డెజర్ట్. కాబట్టి దీన్ని ఇంట్లోనూ త్వరగా తయారు చేసుకోవచ్చు. అంతే కాకుండా ఇది రుచిగా ఉండటమే కాకుండా శరీరానికి చాలా ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది బరువును తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. అందువల్ల దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం నుంచి వ్యర్థాలను తొలగించడంలోనూ సహాయపడుతుంది.

బెల్లం రైస్ ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందంటే..!

ఇవి కూడా చదవండి

మనం తినే బెల్లం రైస్ మన శరీరానికి అవసరమైన ఇనుమును తగినంత మొత్తంలో అందిస్తుంది. ఇందులో కాల్షియం, ఇతర పోషకాలు ఉండటం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు దరిచేరవు. అలాగే ఈ బెల్లం రైస్ తినడం వల్ల హిమోగ్లోబిన్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. బెల్లం బియ్యం తీసుకోవడం వల్ల అందులోని పొటాషియం కంటెంట్ శరీరానికి లభిస్తుంది. ఇది రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. అలసటను తగ్గిస్తుంది. తక్షణ శక్తిని ఇస్తుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులతో బాధపడేవారు బెల్లం రైస్ క్రమం తప్పకుండా తినాలి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఎముకలను బలపరుస్తుంది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. అలాగే బెల్లం రైస్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన భాస్వరం శక్తి లభిస్తుంది. దీనిలోని మాంగనీస్, జింక్, రాగి కంటెంట్ వివిధ ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. కానీ ఈ బెల్లం రైస్ ఎక్కువగా తినకూడదు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు బెల్లం రైస్ తినకపోవడమే మంచిది.

గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.