AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghee With Warm Water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరు వెచ్చటి నీటిలో నెయ్యి కలిపి తాగితే.. మతిపోయే లాభాలు !

మీరు రోటీ లేదా కూరగాయలతో కలిపి నెయ్యి తినడానికి బదులుగా ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక టీస్పూన్ నెయ్యిని గోరువెచ్చని నీళ్లలో కలిపి తీసుకోవాలని చెబుతున్నారు. ఇలా తీసుకోవడం వల్ల మీ జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది. ఇది మీ చర్మాన్ని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన కీళ్లను కాపాడుతుంది. అయితే, దానిని సరైన పరిమాణంలో, సరైన మార్గంలో తీసుకోవడం ముఖ్యం అంటున్నారు. అదేలాగో ఇక్కడ చూద్దాం..

Ghee With Warm Water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరు వెచ్చటి నీటిలో నెయ్యి కలిపి తాగితే.. మతిపోయే లాభాలు !
Ghee With Warm Water
Jyothi Gadda
|

Updated on: Sep 27, 2025 | 9:52 PM

Share

భారతీయ వంటగదులు అనేక ఆరోగ్యకరమైన పదార్థాలతో సమృద్ధిగా ఉంటాయి. వాటిలో నెయ్యి కూడా ఒకటి. కానీ, కొందరు నెయ్యిని అనారోగ్యకరమైనదిగా భావించి పక్కనపెడుతుంటారు. కానీ, వాస్తవానికి నెయ్యి అనేక ప్రయోజనాలను అందించే ఆరోగ్యకరమైన కొవ్వు అంటున్నారు పోషకాహార నిపుణులు.

నెయ్యి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?..

పలువురు డైటీషియన్లు, న్యూట్రిషనిస్ట్‌లు చెప్పిన వివరాల మేరకు.. నెయ్యి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. కానీ, చాలా మందికి నెయ్యిని ఎలా వాడాలో తెలియదు అంటున్నారు. గరిష్ట ప్రయోజనాలను పొందాలంటే మీరు నెయ్యిని సరైన విధానంలో తీసుకోవాలి. మీరు రోటీ లేదా కూరగాయలతో కలిపి నెయ్యి తినడానికి బదులుగా ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక టీస్పూన్ నెయ్యిని గోరువెచ్చని నీళ్లలో కలిపి తీసుకోవాలని చెబుతున్నారు. ఇలా తీసుకోవడం వల్ల మీ జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది. ఇది మీ చర్మాన్ని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన కీళ్లను కాపాడుతుంది. అయితే, దానిని సరైన పరిమాణంలో, సరైన మార్గంలో తీసుకోవడం ముఖ్యం అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఖాళీ కడుపుతో నెయ్యి తినడం ఎందుకు ప్రయోజనకరం?..

ఉదయం ఖాళీ కడుపుతో నెయ్యి-నీళ్ళు తాగడం వల్ల శరీరానికి జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడం, శక్తిని అందించడం వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయి.

మలబద్ధకం నశిస్తుంది: ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి నీళ్లు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. నెయ్యిలోని బ్యూట్రిక్ యాసిడ్ పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు. గోరువెచ్చని నీటితో దీనిని తీసుకోవడం వల్ల జీవక్రియ పెరుగుతుంది.

శరీరం నుండి విష పదార్థాలు తొలగిపోతాయి:

ఉదయం గోరువెచ్చని నీటితో నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల శరీరం విషాన్ని తొలగిస్తుంది. ఈ మిశ్రమం విషాన్ని బయటకు పంపి కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. నెయ్యి శరీరాన్ని లోపలి నుండి పోషిస్తుంది. చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది.

ఎముకలు బలపడతాయి:

ఎముకలను బలపరుస్తుంది. నెయ్యిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, కాల్షియం ఉన్నాయని పోషకాహార నిపుణులు చెప్పారు. ఇవి ఎముకలను బలపరుస్తాయి. ఇంకా, నెయ్యి మెదడుకు పోషణనిస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

రోజుకు ఎంత నెయ్యి తినాలి?:

అయితే, నెయ్యిని అధికంగా తీసుకోవడం వల్ల కేలరీలు, కొవ్వు అధికంగా వస్తుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్ లేదా ఊబకాయం ఉన్నవారికి, దాని పరిమాణాన్ని గుర్తుంచుకోవడం ముఖ్యం.

నెయ్యి ఎవరు తినాలి, ఎవరు తినకూడదు?:

పోషకాహార నిపుణుల ప్రకారం… సాధారణ బరువు, ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించాలనుకునే వారికి నెయ్యి వినియోగం ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ, ఊబకాయం ఉన్నవారు నెయ్యి తీసుకోవడం పరిమితం చేసుకోవాలి. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను నివారించడానికి వైద్యుడి సలహా మేరకు మాత్రమే నెయ్యిని తీసుకోవాలి. కాలేయ సమస్యలు ఉన్నవారికి నెయ్యిని అధికంగా తీసుకోవడం హానికరం, కాబట్టి వారు దానిని జాగ్రత్తగా వాడాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..