AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Almonds: ఆరోగ్యానికి మంచిది కదా అని బాదం పప్పులు లాగించేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోండి..

బరువు తగ్గాలన్నా, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలన్నా చాలామంది ప్రతి రోజూ ఉదయం 5 నుంచి 6 నానబెట్టిన బాదంపప్పులు తింటుంటారు. నానబెట్టిన బాదంపప్పులు ప్రతి రోజు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పైగా ఆరోగ్యకరమైన ఆహారాలలో ఇవీ ముఖ్యమైనవే. అందుకే డాక్టర్ల నుంచి న్యూట్రిషనిస్టుల వరకు అందరూ బాదం పప్పు తినాలని సూచిస్తుంటారు. కానీ అసలు సమస్య ఏమిటంటే..

Almonds: ఆరోగ్యానికి మంచిది కదా అని బాదం పప్పులు లాగించేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోండి..
బాదంలో ఫైబర్ ఉంటుంది, ఇది మీ జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. బాదంలో ఉండే విటమిన్ ఇ మీ చర్మానికి అవసరమైన పోషణను అందిస్తుంది. ఇది ముఖానికి మెరుపును తెస్తుంది. ఇది కాకుండా, బాదంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని పెంచే శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. అటువంటి పరిస్థితిలో, బాదం మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.
Srilakshmi C
|

Updated on: Jul 07, 2024 | 7:54 PM

Share

బరువు తగ్గాలన్నా, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలన్నా చాలామంది ప్రతి రోజూ ఉదయం 5 నుంచి 6 నానబెట్టిన బాదంపప్పులు తింటుంటారు. నానబెట్టిన బాదంపప్పులు ప్రతి రోజు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పైగా ఆరోగ్యకరమైన ఆహారాలలో ఇవీ ముఖ్యమైనవే. అందుకే డాక్టర్ల నుంచి న్యూట్రిషనిస్టుల వరకు అందరూ బాదం పప్పు తినాలని సూచిస్తుంటారు. కానీ అసలు సమస్య ఏమిటంటే.. వీటిని సరైన పద్ధతిలో తినకుంటే మేలుకు బదులు చిక్కులు తెచ్చిపెడుతుంది. అందుకే ఎల్లప్పుడూ సరైన మోతాదులో బాదంపప్పులు తీసుకోవాలి. వేగంగా ప్రయోజనాలను పొందాలనే ఆశతో చాలా మంది బాదంపప్పులను అధిక మొత్తంలో తింటుంటారు. ఇది అంత మంచిది కాదు. ఇక్కడే అసలు ప్రమాదం ఉంది. బాదం పప్పు ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా?

  • బాదంపప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అదే అధికంగా తింటే ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. పీచు ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. గ్యాస్, గుండె మంట, మలబద్ధకం సమస్యలు పెరుగుతాయి.
  • బాదంపప్పులో ఆక్సలేట్లు ఉంటాయి. ఆక్సలేట్ అధికంగా తీసుకున్నప్పుడు, అది మూత్రపిండాల్లో రాళ్ల రూపంలో పేరుకుపోతుంది. కిడ్నీలో రాళ్ల ప్రమాదాన్ని నివారించాలనుకుంటే 5-6 బాదంపప్పుల కంటే ఎక్కువ తినకూడదు.
  • బాదం పప్పు తినడం వల్ల అలర్జీ సమస్యలు వస్తాయి. సాధారణంగా బాదంపప్పు తినడం వల్ల శరీరంపై ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. కానీ ఇప్పటికే అలెర్జీ సమస్యలుంటే.. అలాంటి వారు బాదంపప్పులను ఎక్కువగా తింటే ప్రమాదంలో పడటం ఖాయం.
  • పోషకాహార నిపుణులు సాధారణంగా బరువు తగ్గడానికి నానబెట్టిన బాదంపప్పులను తినమని సిఫార్సు చేస్తుంటారు. ఈ గింజలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ బాదంపప్పు పరిమాణంలో జాగ్రత్తలు తీసుకోకుండా తింటే మాత్రం ప్రమాదమే. వీటిని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కేలరీలు పెరుగుతాయి. అప్పుడు బరువు తగ్గడానికి బదులు పెరుగుతుంది.
  • బాదంపప్పులో విటమిన్ ఇ ఉంటుంది. ఇది శరీరంలో యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కానీ మీరు శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ విటమిన్ ఇ తీసుకుంటే ఎటువంటి ప్రయోజనం పొందకపోగా.. విరేచనాలు, వాంతులు, తల తిరగడం వంటి రకరకాల సమస్యలు వస్తాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.