అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అందులోనూ అందం విషయంలో ఖచ్చితంగా ఉంటారు లేడీస్. ఎలాంటి మచ్చలు, మొటిమలు లేని చర్మం కావాలని అందరూ అనుకుంటారు. అలాగే చర్మం అందంగా మెరుస్తూ ఉంటే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు. ముఖంపై మృత కణాలు పేరుకు పోవడం వలన కూడా ముఖం డల్‌గా మారుతుంది. అందాన్ని రెట్టింపు చేసే చిట్కాలు ఎన్నో తెలుసుకున్నాం. మంచి ఆహారం తీసుకోవడం వలన లోపలి నుంచి మరింత అందంగా కనిపిస్తారు. ముఖాన్ని అందంగా మార్చడంలో టమాటా ఎంతో చక్కగా పని చేస్తుంది. టమాటాతో చర్మంపై ఉండే టానింగ్, మృత కణాలు, మచ్చలు, మొటిమలు తగ్గించుకోవచ్చు. చర్మ సమస్యలను తొలగించడంలో టమాటాలు ఎంతో ఎఫెక్టీవ్‌గా పనిచేస్తాయి. ఎందుకంటే ఇందులో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ సమస్యలను తగ్గించడంలో ఎంతో చక్కగా పని చేస్తుంది.
టమాటా, కాఫీ స్క్రబ్ చర్మ అందాన్ని పెంచడంలో ఎంతో చక్కగా సహాయ పడుతుంది. ఈ రెండింటి కాంబినేషన్ చర్మంపై ఉండే మృత కణాలను వదిలించుకోవడానికి చక్కగా యూజ్ అవుతుంది. ఈ ఫేస్ స్క్రబ్ ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సగం టమాటా ముక్క తీసుకుని దానిపై కొద్దిగా పంచదార, కాఫీ పౌడర్ వేయండి.
ఇప్పుడు దీన్ని ముఖంపై సున్నితంగా రుద్దండి. ఈ స్క్రబ్ డెడ్ స్కిన్‌ను పూర్తిగా తొలగిస్తుంది. ఈ స్క్రబ్ టానింగ్, డార్క్ స్పాట్స్‌ను కూడా తగ్గించడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే ఫేస్ కాంతివంతంగా మారుతుంది. ఇలా పావుగంట సేపు ఇలానే ఉంచండి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడగాలి.
టమాటా, అలోవెరా జెల్ కూడా చర్మ సమస్యలను తగ్గించడంలో ఎంతో చక్కగా పని చేస్తుంది. ముఖంపై ఉండే నల్ల మచ్చలు పోవడానికి ఈ జెల్ బాగా హెల్ప్ చేస్తుంది. సగం టమాటా ముక్క మీద ఒక స్పూన్ కలబంద జెల్ తీసుకోవాలి. దీన్ని ముఖానికి సున్నితంగా కొద్దిసేపు మర్దనా చేయాలి. ఇది ముఖంపై ఉండే మంటను తగ్గిస్తుంది. ముఖంపై మచ్చలను కూడా తగ్గిస్తుంది. అలాగే మీ చర్మాన్ని కూడా హైడ్రేట్ చేస్తుంది. ఈ ఫేస్ స్క్రబ్‌తో మంచి ఫలితాలు ఉంటాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..