08 December 2025

డేంజర్ గురూ.. వీరు అస్సలే ఆకుకూరలు తినకూడదు!

samatha

Pic credit - Instagram

ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకు కూరల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన ప్రతి ఒక్కరూ తప్పకుండా రోజూ ఆకు కూరలు తినాలంటారు.

చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి రోజూ లేదా కనీసం వారంలో రెండు రోజులైనా ఆకు కూరలు తినడం చాలా మంచిదని చెబుతుంటారు.

కానీ కొంత మంది మాత్రం అస్సలే ఆకుకూరలు తినడం మంచిది కాదంట. కాగా, ఇప్పుడు మనం ఏ సమస్యలు ఉన్నవారు ఆకు కూరలు తినకూడదో చూద్దాం

ఆకు కూరల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ ఉండటం వలన ఇవి శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందజేస్తాయి.

అయితే ఇన్ని పోషకాలు ఉన్నప్పటికీ,  కిడ్నీ రాళ్ల సమస్యతో బాధపడే వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీటిని తినకూడదంట. దీని వలన సమస్య మరింత తీవ్రతరం అవుతుంది.

అదే విధంగా, ఇన్ఫ్లమెంటరీ బవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలు, తీవ్రమైన కడుపు నొప్పి, గ్యాస్ , తిమ్మిరి సమస్యతో బాధపడే వారు కూడా అస్సలే ఆకు కూరలు తినకూడదంట.

అలాగే, పేగు సమస్యలు, ముఖ్యంగా ఏదైనా సీజరిన్ అయి ఉంటే, శస్త్ర చికిత్స 12 గంటల తర్వాత నుంచి రెండు వారాల పాటు ఆకు కూరలు తినడం మంచిది కాదంట.

కొన్ని రకాల హోమియోపతి, లేదా ఇతర మందులు వాడుతున్న వారు కూడా కొన్ని రోజుల పాటు ఆకు కూరలు తినకుండా ఉండటం మంచిదని చెబుతున్నారు నిపుణులు.