Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heat Stroke: ఏసీ వల్ల కూడా వడదెబ్బ తగులుతుందా? ఈ కథనం చదవండి షాక్ అయిపోతారు..

అతిగా ఏసీ వాడే వారికి ఓ షాకింగ్ న్యూస్. రోజూ ఏసీలు వాడేవారు కూడా వడదెబ్బకు గురవతారని మీకు తెలుసా? నిజం అండి బాబు.. మధ్యాహ్నం సమయంలో బాగా ఎండగా ఉన్నప్పుడు.. అప్పటి వరకూ ఏసీ లో ఉండి సడన్ గా బయటకు వచ్చారనుకోండి మీకు వడ దెబ్బ తగిలే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు.

Heat Stroke: ఏసీ వల్ల కూడా వడదెబ్బ తగులుతుందా? ఈ కథనం చదవండి షాక్ అయిపోతారు..
Heatwaves
Follow us
Madhu

|

Updated on: Jun 24, 2023 | 7:30 AM

ఏడాది లాంగ్ సమ్మర్ ఉంది. జూన్ మాసం అయిపోతున్నా ఎండలు పూర్తి స్థాయిలో తగ్గలేదు. అక్కడక్కడ వర్షాలు పడుతున్నా.. వాతావరణం పూర్తి స్థాయిలో చల్లబడలేదు. దీంతో ఇంకా ఏసీల వినియోగం అధికంగానే ఉంటోంది. అయితే అతిగా ఏసీ వాడే వారికి ఓ షాకింగ్ న్యూస్. రోజూ ఏసీలు వాడేవారు కూడా వడదెబ్బకు గురవతారని మీకు తెలుసా? నిజం అండి బాబు.. మధ్యాహ్నం సమయంలో బాగా ఎండగా ఉన్నప్పుడు.. అప్పటి వరకూ ఏసీ లో ఉండి సడన్ గా బయటకు వచ్చారనుకోండి మీకు వడ దెబ్బ తగిలే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. దాని నుంచి ఎలా బయటపడాలి? చేయాల్సిన పనులేంటి? చేయకూడదనివి ఏంటి? తెలుసుకుందాం రండి..

తేడా ఇదే..

సాధారణంగా ఎయిర్ కండిషనింగ్ ఉన్న గదిలో బయట కంటే 15 నుండి 20 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఎక్కువ సేపు ఇలాంటి వాతావరణంలో ఉండి.. ఒకేసారి అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతానికి వెళ్లారనుకోండి.. మీ శరీరం అంతా సడన్ చేంజ్ ని తట్టుకోలేదు. వాస్తవానికి వేడి ఎక్కువ అయ్యి.. గాలి తక్కువ అయితే శరీరం చెమటను బయటకు పంపిస్తుంది. కానీ మీరు అప్పటి వరకూ ఏసీలో ఉండి వచ్చారు కాబట్టి చర్మం పొడిబారిపోతుంది. చెమట పట్టదు. చెమట బయటకు రావడానికి చాలా కష్టతరం అవుతుంది. దీని వల్ల వృద్ధులు, పిల్లలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు బాగా ప్రభావితం అవుతారు. చెమట పట్టే మెకానిజం శరీరంలో సక్రమంగా పనిచేయని కారణంగా హీట్ స్ట్రోక్ కి గురవుతారు. లేదా హీట్ హైపర్‌పైరెక్సియాను ఉత్పత్తి చేస్తుంది. ఇది శరీరంలోని ఇతర అవయవాలకు కూడా హాని చేస్తుంది. ఈ నేపథ్యంలో హీట్ స్ట్రోక్ ని నివారించడానికి చేయాల్సినవి.. చేయకూడని పనుల గురించి నిపుణులు చెబుతున్న అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి
  • ముఖ్యంగా మధ్యాహ్నం 12.00 నుంచి 3.00 గంటల మధ్య ఎండలో బయటకు వెళ్లడం మానుకోవాలి.
  • తగినంత నీరు తాగండి. మీకు దాహం వేయకపోయినా వీలైనంత తరచుగా నీరు తాగాలి.
  • తేలికైన, లేత-రంగు, వదులుగాఉండే పోరస్ కాటన్ దుస్తులను ధరించండి.
  • ఎండలో బయటకు వెళ్లేటప్పుడు రక్షణ కళ్లజోళ్లు, గొడుగు/టోపీ, బూట్లు లేదా చప్పల్స్ ఉపయోగించండి.
  • బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు శ్రమతో కూడిన కార్యకలాపాలను నివారించండి. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయట పని చేయడం మానుకోండి.
  • ప్రయాణిస్తున్నప్పుడు, మీతో పాటు నీటిని తీసుకెళ్లండి.
  • శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బోనేటేడ్ శీతల పానీయాలకు దూరంగా ఉండండి.
  • అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని మానుకోండి.
  • మీరు బయట పని చేస్తున్నట్లయితే, టోపీ లేదా గొడుగును ఉపయోగించండి. మీ తల, మెడ, ముఖంలపై తడి గుడ్డను కూడా ఉపయోగించండి.
  • పార్క్ చేసిన వాహనాల్లో పిల్లలను, పెంపుడు జంతువులను వదిలి వెళ్లవద్దు.
  • మీకు మూర్ఛ లేదా అనారోగ్యం అనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
  • ఓఆర్ఎస్, ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, తోరణి (బియ్యం నీరు), నిమ్మకాయ నీరు, మజ్జిగ మొదలైనవి వాడండి. ఇవి శరీరాన్ని తిరిగి హైడ్రేట్ చేయడానికి సహాయపడతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..