Anti Aging Tips: 40లలో కూడా నవ యవ్వనంగా కనిపించాలంటే.. తప్పక తీసుకోవలసిన ఆహారాలివే..

|

Feb 26, 2023 | 9:58 AM

నాణ్యత లేని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు, చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు కూడా కనిపించే ప్రమాదం..

Anti Aging Tips: 40లలో కూడా నవ యవ్వనంగా కనిపించాలంటే.. తప్పక తీసుకోవలసిన ఆహారాలివే..
Anti Aging Foods
Follow us on

ప్రస్తుత కాలంలో మనం పాటించే జీవన శైలి, ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. మనం తీసుకునే రోజువారీ ఆహారంలో సరిపడా పోషకాలు ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే శరీరానికి అందవలసిన పోషకాలు లభించకపోతే ఆరోగ్య సమస్యలు తప్పవు. ఇంకా ఆరోగ్య సంరక్షణ కూడా సవాలుగా మారుతుంది. ఇంకా నాణ్యత లేని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు, చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు కూడా కనిపించే ప్రమాదం ఎక్కువగా ఉంది. మరి ఈ చర్మ సంబంధిత సమస్యలను అరికట్టడానికి కొన్ని రకాల ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారంలో పోషకాలతో కూడిన ఆహారాలను జోడించడం వలన వృద్ధాప్య ఛాయలను తగ్గించుకోవచ్చు. అంతేకాక 40 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా నవ యవ్వనంగా కనిపించవచ్చని నిపుణుల మాట. మరి అందుకోసం ఏయే ఆహారాలను తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

బొప్పాయి: బొప్పాయిలోని పాపైన్ అనే ఎంజైమ్ చర్మ సంరక్షణ‌కు తోడ్పడతుంది. ఇంకా యాంటీ ఏజింగ్ ప్రయోజనాల కోసం ఈ పండులో లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి వృద్ధాప్య సంకేతాల నుంచి రక్షణ కల్పిస్తాయి.

దానిమ్మ: దానిమ్మపండులో ప్యూనికాలాజిన్స్ అనే సమ్మేళనం ఉంది. ఇది చర్మంలో కొల్లాజెన్‌ను సంరక్షించడంలో సహాయపడుతుంది. తద్వారా వృద్ధాప్య సంకేతాలను నెమ్మదింపచేస్తుంది.

ఇవి కూడా చదవండి

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్: ఆకు కూరల్లో ఉండే క్లోరోఫిల్ చర్మంలో కొల్లాజెన్‌ను పెంచి వృద్ధాప్య వ్యతిరేక కారకాలకు దోహదం చేస్తుంది.

టమాటాలు: టమాటాలో అధిక స్థాయిలో లైకోపీ ఉంటుంది. ఇది చర్మం సూర్యరశ్మికి వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడే విటమిన్ సి కి కూడా టమాటాలు మంచి మూలం. టమోటలను తీసుకోవటం వల్ల చర్మం కాంతి వంతంగా కూడా మారుతుంది.

గ్రీన్ టీ: గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. గ్రీన్ టీలో ముఖ్యంగా పాలీఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ప్రత్యేకంగా ఇది ఎపిగాల్లోకాటెచిన్ గాలెట్ , కాటెచిన్స్, గల్లిక్ యాసిడ్‌లో ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు, కాలుష్యం వంటి పర్యావరణ ఒత్తిళ్ల నుంచి బాహ్య చర్మ వృద్ధాప్యాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి