Indians cannot afford healthy diet: ఓ వైపు పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలు.. అందుకు తగిన విధంగా పెరగని ఆహారధాన్యం ఉత్పత్తులు. ఇక కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన అనంతరం ప్రపంచ దేశాల ఆర్ధిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపించిది. పేద దేశాలు మరింత పేద దేశాలుగా మారిపోయాయి. మొత్తం ప్రపంచ జనాభాలో 42శాతం మంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోలేకపోతున్నారని కొన్ని లెక్కల ద్వారా తెలుస్తోంది. ఇక భారతదేశంలో అయితే 71శాతం మంది ప్రజలకు సరైన పోషకాహారం లభించడం లేదని తెలుస్తోంది. ఫలితంగా మధుమేహం, శ్వాసకోశ వ్యాధి, క్యాన్సర్ , గుండె జబ్బులు వంటి ఆహార-ప్రమాద సంబంధిత వ్యాధులతో ఏటా 1.7 మిలియన్ల మంది మరణిస్తున్నారని పలు గణాంకాల ద్వారా వెల్లడైన చేదు నిజం.
సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సిఎస్‌ఇ) ‘స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్‌మెంట్’ నివేదిక ప్రకారం, ఆహారంలో పండ్లు, కూరగాయలు, ధాన్యాలు లేకపోవడంతో పాటు.. ప్రాసెస్ చేసిన మాంసం, ఎర్ర మాంసం, చక్కెర పానీయాలు అధికంగా ఉండటం వల్ల అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ఒక వ్యక్తి తక్కువ బరువు లేదా అధిక బరువు కలిగి ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణంగా మారుతోందని తెలుస్తోంది.
నివేదిక ప్రకారం, ఆహార వ్యవస్థలు, పద్ధతులు పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలకు పాల ఉత్పత్తి అతిపెద్ద సహకారం. అదనంగా ధాన్యాల ఉత్పత్తిలో నీరు, నత్రజని, భాస్వరం ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి.
ఆహార పదార్థాల ధరలను కూడా నివేదిక విశ్లేషించింది. గత సంవత్సరం వినియోగదారుల ఆహార ధరల సూచిక 327% పెరుగుదలను నమోదు చేయగా.. వినియోగదారుల ధరల ఇండెక్స్ 84% పెరిగింది. CSEకి అనుబంధంగా ఉన్న పర్యావరణవేత్త రిచర్డ్ మోహపాత్ర. ఇదే విషయంపై స్పందిస్తూ.. రోజు రోజుకీ తిన ఆహారపదార్ధాల పెరుగుల భారీ నుంచి అతిభారీగా పెరుగుతున్నయని పేర్కొన్నారు.
గత మార్చి, ఏప్రిల్‌లో పశ్చిమ బెంగాల్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, అస్సాం, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, తమిళనాడు వంటి 17 రాష్ట్రంలోని నగరాల కంటే ఆంధ్రప్రదేశ్ లోని వివిధ గ్రామాల్లో ఆహార ధరలు ఎక్కువగా పెరిగినట్లు తెలుస్తోంది. బీహార్, కర్నాటక, కేరళ, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ నగరాల్లో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది. ఆహార రంగంలో దేశం పురోగమిస్తోందని.. అయితే ఆహారం ఆరోగ్యకరంగా ఉండడం లేదన్నారు. దేశంలో పోషకాహార లోపం తీవ్ర స్థాయిలో ఉందని.. దీని వలన మన దేశంలో దాదాపు మూడొంతుల మందికి సరైన పోషకారం లేదని .. దీంతో ఆహార సంబంధిత వ్యాధుల బారిన పడుతూ.. ఏటా 17 లక్షల మంది మరణిస్తున్నారని చెప్పారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..