AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pot Water: ఇందులో నీళ్లు తాగితే ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్టే.. మట్టికుండలు కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి..

ఎండాకాలం పేరు వినగానే మొదట గుర్తుకు వచ్చేది చల్లనీళ్లు. వేసవి సీజన్ ప్రారంభమైన వెంటనే అందరూ చల్లటి నీళ్లు తాగడం మొదలుపెడతారు. రిఫ్రిజిరేటర్‌లో నీటిని ఉంచితే కొద్ది నిమిషాల్లో అది చల్లబడుతుందని మనందరికీ తెలిసిన విషయమే. అయితే, రిఫ్రిజిరేటర్ నీరు ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. వేసవి తర్వాత ఫ్రిజ్ నుండి చల్లని నీళ్లు తాగితే గొంతు సమస్యలు, జీర్ణక్రియ ఇబ్బందులు వంటివి తలెత్తుతాయి. అలాగని మట్టికుండలు కొని వాడినా ఇంతకన్నా పెద్ద సమస్యలే వస్తున్నాయి. ఎందుకంటే వీటి తయారీలో వాడుతున్న రసాయనాలే ఇందుకు కారణం. ఈ జాగ్రత్తలు పాటిస్తే దీని నుంచి తప్పించుకోవచ్చు.

Pot Water: ఇందులో నీళ్లు తాగితే ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్టే.. మట్టికుండలు కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి..
Summer Pots Side Effects
Bhavani
|

Updated on: Apr 10, 2025 | 4:55 PM

Share

పూర్వం నీటిని చల్లగా ఉంచడానికి మట్టి కుండలను ఎక్కువగా వాడేవారు. కానీ ఆధునిక యుగంలో రిఫ్రిజిరేటర్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. అయినప్పటికీ, ఫ్రిజ్ నీటి కంటే మట్టి కుండలోని నీరు తాగడం ఎప్పుడూ ఉత్తమం. నీటిని సహజంగా చల్లబరచడంలో మట్టి కుండలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అయితే, కుండ కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని కుండలు నీటిని సరిగా చల్లబరచవు, మరికొన్ని త్వరగా పగిలిపోతాయి. అందుకే, మట్టి కుండ కొనేటప్పుడు దేన్ని గమనించాలో తెలుసుకుందాం…

ఈ రంగులతో రోగాలే:

మట్టి కుండ కొనేముందు దాని రంగుపై దృష్టి పెట్టడం ముఖ్యం. నలుపు రంగు కుండ ఎంచుకోవడం మంచిది, ఎందుకంటే అందులో నీరు ఎక్కువ చల్లగా ఉంటుంది. ఎరుపు రంగు కుండ కూడా తీసుకోవచ్చు, కానీ అది టెర్రకోటతో తయారైనది ఎంచుకోండి. కుండపై చేతితో రుద్దితే రంగు అంటుకుంటే దాన్ని వాడకండి. అలాగే, పెయింట్ వేసిన కుండలను కొనొద్దు, ఎందుకంటే వాటిలోని రసాయనాలు నీటిలో కలిసి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

లీకేజీని చెక్ చేయండి:

కొన్ని కుండల కింది భాగంలో లీకేజీ ఉంటుంది. కాబట్టి, కొనే ముందు కుండలో నీళ్లు పోసి కొంత సమయం నేలపై ఉంచి చూడండి. నీరు కారితే ఆ కుండ నాణ్యత లేనిదని గ్రహించండి.

మందాన్ని గమనించండి:

నీటిని ఎక్కువ సేపు చల్లగా ఉంచే మందమైన కుండను ఎంచుకోండి. పలుచని కుండలు తేలికగా పగిలిపోతాయి. అందుకే మందంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.

వాసనను పరిశీలించండి:

కుండ కొనేటప్పుడు దాని వాసనను చూడండి. కుండలో నీళ్లు పోసి మట్టి వాసన వస్తుందో లేదో చూడండి. మట్టి వాసన వస్తే అది మంచి నాణ్యతతో తయారైందని అర్థం. వాసన రాకపోతే అందులో రసాయనాలు కలిపి ఉండవచ్చు.

సైజూ ముఖ్యమే:

కుండ కొనే ముందు మీ వంటగదిలో స్థలాన్ని ఆలోచించండి. వంటగదిలో స్థలం ఎక్కువగా ఉంటేనే పెద్ద కుండ తీసుకోండి. చిన్న కుటుంబం అయితే జగ్ లేదా మట్టి సీసా సరిపోతుంది.

లోపలి భాగాన్ని చూడండి:

కుండ లోపల గరుకుగా ఉందో లేదో తనిఖీ చేయండి. గరుకుగా ఉంటే అది స్వచ్ఛమైన మట్టితో తయారైనదని అర్థం. నునుపుగా ఉంటే సిమెంట్ లేదా ఇతర మిశ్రమాలు ఉండవచ్చు.

మట్టి కుండ నీటి ప్రయోజనాలు:

జీర్ణక్రియ మెరుగుపడుతుంది. హీట్ స్ట్రోక్ నివారణకు దానిలోని ఖనిజాలు సహాయపడతాయి. గొంతు నొప్పిని తగ్గిస్తుంది. ఆమ్లత్వ సమస్యలను దూరం చేసే ఆమ్ల గుణాలు ఉంటాయి.