Skin Care: వర్షాకాలంలోనూ చర్మం మెరిసిపోవాలంటే.. ఈ చిట్కాలు పాటించండి..
వర్షాకాలంలో అనేక చర్మసంబంధిత సమస్యలు వస్తాయి. చర్మ రక్షణ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. అయినా వర్షా కాలంలో చర్మం జిడ్డుగా ఉంటుంది. కాని కొన్ని చిట్కాలు పాలో అయితే మన చర్మం వర్షాకాలంలోనూ మెరిసిపోతుంది. వానా కాలంలో చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటే..
Skin Care Tips: వర్షాకాలంలో అనేక చర్మసంబంధిత సమస్యలు వస్తాయి. చర్మ రక్షణ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. అయినా వర్షా కాలంలో చర్మం జిడ్డుగా ఉంటుంది. కాని కొన్ని చిట్కాలు పాలో అయితే మన చర్మం వర్షాకాలంలోనూ మెరిసిపోతుంది. వానా కాలంలో చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ముఖ్యంగా మనం తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. వర్షాకాలంలో ఎక్కువగా టీ తాగడం, ఆయల్ ఫుడ్స్ బజ్జీలు లేదా పకోడి లాంటివి తినడం చేస్తుంటారు. చర్మ సంరక్షణ కోరుకునేవారు వర్షాకాలంలో ఇలాంటి పదార్థాలు తినకూడదు. నూనె వస్తువులు ఎక్కువుగా తినడం వల్ల, తేమ పెరగడం వల్ల జిడ్డు చర్మం తయారవుతుంది దీంతో మొటిమలు, బ్లాక్‌హెడ్స్‌కు దారి తీస్తుంది.
వర్షాకాలంలో చర్మ సంరక్షణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు
ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి: చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి, ఇన్ఫెక్షన్ నుండి రక్షించుకోవడానికి పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలి. వర్షాకాలంలో ముఖాన్ని రోజుకు కనీసం మూడుసార్లు శుభ్రం చేసుకోవాలి. అదనపు తేమ కారణంగా శరీరంపై రంధ్రాలు మూసుకుపోతాయి. అందుకే ముఖాన్ని ఎక్కువసార్లు శుభ్రం చేసుకోవడం ద్వారా మురికిని తొలగించుకుని, చర్మం మెరిసేలా చూసుకోవచ్చు.
మాయిశ్చరైజర్ ఉపయోగించండి: వర్ష కాలంలో శరీరంపై ఎక్కువగా తేమ ఉంటుంది. ఇది చర్మం లోపలి పొరను పొడిగా, పాడయ్యేలా చేస్తుంది. చర్మాన్ని తేమగా, మృదువుగా, ఆరోగ్యంగా చేయడానికి ఎల్లప్పుడూ పోషకమైన మాయిశ్చరైజర్‌ని ఉపయోగించాలి. ఎక్కువ జిడ్డుగల చర్మం ఉన్నవారు నీటి ఆధారిత మాయిశ్చరైజర్‌ను వాడటం మంచిది. ఇది చర్మం నుండి జిడ్డును తొలగించే గొప్ప లక్షణాలను కలిగి ఉంటుంది.
చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయండి: డెడ్ స్కిన్ సెల్స్ వదిలించుకోవడానికి ఏదైనా సున్నితమైన స్క్రబ్‌తో ప్రతిరోజూ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయాలి. అలా చేయడం ద్వారా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు.
జుట్టు సంరక్షణ: వర్షాకాలంలో జుట్టును జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. తేమ, ధూళి, బ్యాక్టీరియా కారణంగా జుట్టు రాలుతుంది. అటువంటి పరిస్థితుల్లో హెయిర్ వాష్‌పై శ్రద్ధ వహించాలి.
ఆల్కహాల్ లేని వస్తువులను ఉపయోగించాలి: వర్షాకాలంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. వర్షాకాలంలో స్కిన్ టోన్‌ను కాపాడుకోవాలి. తేమ కారణంగా చర్మంపై ఏర్పడే అదనపు జిడ్డును తొలగించుకోవడం కోసం ముఖానికి రాసుకునే వస్తువులు, క్రీమ్స్ లలో ఆల్కహాల్ లేని ఉత్పత్తులను ఉపయోగించాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..