AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beatroot Effects: మంచి ఆరోగ్యం కోసం బీట్ రూట్ తింటున్నారా.. ఈజాగ్రత్తలు పాటించండి..

మంచి ఆరోగ్యం కోసం చాలా మంది ఎక్కువ పోషకాలు ఉండే పదార్థాలను తీసుకుంటాం. చాలామంది ఎక్కువ పోషకాలు ఉన్న పదార్థాల్లో బీట్ రూట్ ను తీసుకుంటారు. కొంతమంది బీట్ రూట్ అంటే ఇష్టపడరు. కాని బీట్ రూట్ ఉపయోగాలు తెలిసిన వారు అవకాశం ఉన్నప్పుడు..

Beatroot Effects: మంచి ఆరోగ్యం కోసం బీట్ రూట్ తింటున్నారా.. ఈజాగ్రత్తలు పాటించండి..
Beatroot
Amarnadh Daneti
|

Updated on: Aug 30, 2022 | 1:35 PM

Share

Beatroot Side Effects: మంచి ఆరోగ్యం కోసం చాలా మంది ఎక్కువ పోషకాలు ఉండే పదార్థాలను తీసుకుంటాం. చాలామంది ఎక్కువ పోషకాలు ఉన్న పదార్థాల్లో బీట్ రూట్ ను తీసుకుంటారు. కొంతమంది బీట్ రూట్ అంటే ఇష్టపడరు. కాని బీట్ రూట్ ఉపయోగాలు తెలిసిన వారు అవకాశం ఉన్నప్పుడు ఇది తీసుకోకుండా ఉండరు. కూరలుగా చేసుకోవడంతో పాటు, జ్యూస్ గానూ బీట్ రూట్ ను తీసుకుంటూ ఉంటారు. బీట్ రూట్ లో విటమిన్ బి6, ఫోలేట్, పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అయితే బీట్ రూట్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి.. ఈబీట్ రూట్ వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు బీట్ రూట్ ను తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎలాంటి సమయాల్లో బీట్ రూట్ తినకూడదో తెలుసుకుందాం.

అలెర్జీ: బిట్ రూట్‌లో అనేక ఆరోగ్య లక్షణాలు ఉన్నప్పటికి కొంత మంది వాటిని తినడం వల్ల కొన్ని నష్టాలు జరుగుతాయి. అలెర్జీతో బాధపడేవారు బీట్‌రూట్ తీసుకోవడం వల్ల చర్మంపై దద్దుర్లు, అలెర్జీ వంటివి మరింత తీవ్రమవుతాయి. అలెర్జీతో బాధపడేవారు బీట్ రూట్ ను తమ డైట్ లో తీసుకోకూడదు.

కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు: ఆక్సలేట్ కలిగి ఉండే వ్యక్తుల్లో కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు బీట్‌రూట్ తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం. వాస్తవానికి బీట్‌రూట్‌లో ఆక్సలేట్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా మూత్రపిండాల్లో రాళ్ల సమస్య మరింత తీవ్రంగా మారుతుంది. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నట్లయితే దుంపలు తినడాన్ని నివారించవచ్చు. ఒకవేళ తిన్నా చాలా పరిమితంగా తీసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడం: బీట్‌రూట్ తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. చక్కెర స్థాయి ఇప్పటికే ఎక్కువగా ఉన్నవారు బీట్‌రూట్ తినకూడదు. బీట్‌రూట్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా, రక్తంలో అధిక చక్కెర ఉన్నవారు బీట్‌రూట్ వినియోగానికి దూరంగా ఉండాలి.

కాలేయం సమస్య: బీట్‌రూట్‌ను అధికంగా తీసుకోవడం వల్ల కాలేయ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని పలు అధ్యయనాల్లో తేలింది. బీట్‌రూట్‌లో కాపర్, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం ఉంటాయి. ఈ ఖనిజాలు కాలేయంలో పెద్ద మొత్తంలో చేరడం వల్ల.. అవి తీవ్రంగా దెబ్బతీంటాయి. బీట్‌రూట్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కాల్షియం తగ్గుతుంది. ఇది ఎముకల సమస్యను పెంచుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!