AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Psychology Facts: ఎదుటివారి చూపును బట్టి అబద్ధం చెప్తున్నారో.. నిజం చెప్తున్నారో ఇలా కనిపెట్టండి

కళ్లు మన మనసుకు అద్దం లాంటివి అని పెద్దలు అంటారు. మనం నోటితో చెప్పలేని ఎన్నో విషయాలను మన చూపులు తేలికగా బయటపెట్టేస్తాయి. అయితే ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు వారు మీ కళ్లలోకి చూడకుండా పక్కకో, కిందకో చూస్తుండటం ఎప్పుడైనా గమనించారా? సైకాలజీ ప్రకారం ఇలా ఐ కాంటాక్ట్ అవాయిడ్ చేయడం వెనుక వారి వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం..

Psychology Facts: ఎదుటివారి చూపును బట్టి అబద్ధం చెప్తున్నారో.. నిజం చెప్తున్నారో ఇలా కనిపెట్టండి
Psychology Of Avoid Eye Contact
Krishna S
|

Updated on: Jul 05, 2026 | 3:06 PM

Share

మనుషుల మనస్సును, వారి ప్రవర్తనను అర్థం చేసుకోవడం ఒక పెద్ద కళ. చాలాసార్లు మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు.. వారు మన కళ్లలోకి చూడకుండా చూపు తిప్పుకోవడం గమనిస్తూ ఉంటాం. సాధారణంగా దీనిని ఎదుటివారి నిర్లక్ష్యంగా భావిస్తారు. కానీ సైకాలజీ ప్రకారం మాట్లాడేటప్పుడు కళ్లలోకి చూడకపోవడం వెనుక వారి మానసిక స్థితి, వ్యక్తిత్వానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన రహస్యాలు దాగి ఉన్నాయి. ‘‘మాటలు చెప్పలేని ఎన్నో విషయాలను మన కళ్లు సులభంగా చెప్పేస్తాయి’’ అని బాడీ లాంగ్వేజ్ నిపుణులు చెబుతుంటారు. మరి ఒక వ్యక్తి మీతో మాట్లాడుతున్నప్పుడు ఐ కాంటాక్ట్ ఎందుకు అవాయిడ్ చేస్తారు? అనేది తెలుసుకుందాం..

ఆత్మవిశ్వాసం, నమ్మకం లేకపోవడం

మనస్తత్వశాస్త్రం ప్రకారం.. సహజంగా సిగ్గుపడే స్వభావం ఉన్నవారు లేదా ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్న వ్యక్తులు ఎదుటివారి కళ్లలోకి చూసి మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడతారు. కళ్లలోకి నేరుగా చూస్తే తమలో ఉన్న కంగారు, భయం ఎదుటివారికి తెలిసిపోతుందేమోనని వారు ఆందోళన చెందుతారు. ఇలాంటి వారు మాటలతో మేనేజ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, వారి చూపు మాత్రం కిందకే ఉంటుంది.

అబద్ధం చెప్పడం లేదా రహస్యాలు దాచడం

ఎవరైనా ఒక వ్యక్తి అబద్ధం చెబుతున్నప్పుడు లేదా మీ దగ్గర ఏదైనా విషయాన్ని దాస్తున్నప్పుడు నేరుగా కళ్లలోకి చూడటానికి అస్సలు సాహసించరు. తాము దొరికిపోతామనే భయం వారిలో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఏదైనా తప్పు చేసినప్పుడు కలిగే నేరభావన వల్ల కూడా కళ్లు కలపకుండా చూపు పక్కకు తిప్పుకుంటారు. తమ కళ్లు ఎక్కడ నిజాన్ని బయటపెట్టేస్తాయోనన్న భయం వారిలో ఉంటుంది.

సంభాషణపై ఆసక్తి లేకపోవడం

మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి నిరంతరం పక్కకు చూస్తున్నా లేదా వాచ్, ఫోన్ వంక చూస్తున్నా.. వారికి మీరు చెప్పే విషయాలపై అస్సలు ఆసక్తి లేదని అర్థం. వారు తీవ్రమైన విసుగుకు గురవుతున్నారని, ఎలాగైనా ఆ సంభాషణను ముగించుకుని అక్కడి నుండి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారని వారి చూపులు స్పష్టం చేస్తాయి.

మానసిక వేదన, అశాంతి

ఒక వ్యక్తి మానసికంగా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు, విచారంగా ఉన్నప్పుడు లేదా ఏదైనా సమస్యతో కలత చెందినప్పుడు ఒకే విషయంపై దృష్టి పెట్టడం వారికి కష్టమవుతుంది. అటువంటి పరిస్థితిలో వారు మీతో మాట్లాడుతున్నప్పటికీ, వారి చూపు నిలకడగా ఉండదు. ఇది వారు లోలోపల ఏదో ఒక ఆలోచనలో గాఢంగా నిమగ్నమై ఉన్నారనే దానికి సంకేతం. కాగా ఎదుటివారి చూపులను సరిగ్గా గమనించడం ద్వారా.. వారు మీతో నిజాయితీగా మాట్లాడుతున్నారా లేదా ఏదైనా దాస్తున్నారా అనేది సులభంగా కనిపెట్టవచ్చు.

Follow Us
ఎదుటివారి చూపును బట్టి అబద్ధం చెప్తున్నారో.. నిజం చెప్తున్నారో..
ఎదుటివారి చూపును బట్టి అబద్ధం చెప్తున్నారో.. నిజం చెప్తున్నారో..
అతి తక్కువ ఖర్చుతో పాపికొండల టూర్! సరదాగా వెళ్లిరండి
అతి తక్కువ ఖర్చుతో పాపికొండల టూర్! సరదాగా వెళ్లిరండి
800 సినిమాల ప్రస్థానం.. నిర్మలమ్మ గురించి మీకు తెలియని విషయాలు..
800 సినిమాల ప్రస్థానం.. నిర్మలమ్మ గురించి మీకు తెలియని విషయాలు..
బ్రహ్మముహూర్తంలో ఈ 5 కలలు వస్తే అదృష్టం మారినట్టే! స్వప్న శాస్త్ర
బ్రహ్మముహూర్తంలో ఈ 5 కలలు వస్తే అదృష్టం మారినట్టే! స్వప్న శాస్త్ర
విధి వెక్కిరించినా తల వంచలేదు..
విధి వెక్కిరించినా తల వంచలేదు..
ఏపీ ప్రజలకు అలర్ట్: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం..
ఏపీ ప్రజలకు అలర్ట్: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం..
ఫస్ట్ 4 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా లేని ఏకైక భారత కెప్టెన్
ఫస్ట్ 4 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా లేని ఏకైక భారత కెప్టెన్
హైదరాబాదీ దమ్ బిర్యానీ టేస్ట్‎కు ఈ మసాలా దినుసులే కారణం..
హైదరాబాదీ దమ్ బిర్యానీ టేస్ట్‎కు ఈ మసాలా దినుసులే కారణం..
ఏపీ TET 2026కు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? మరికొన్ని గంటలే ఛాన్స్..
ఏపీ TET 2026కు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? మరికొన్ని గంటలే ఛాన్స్..
ఈ ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
ఈ ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్