AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెరిసే చర్మం కోసం శంఖు పువ్వు ఫేస్ ప్యాక్స్..యవ్వనం ఎప్పుడూ మీ వెంటే..!

ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మాన్ని పొందడానికి రసాయనాలతో కూడిన క్రీమ్‌లకు బదులుగా ఆయుర్వేద, సహజసిద్ధమైన పదార్థాలను వాడటం ఎంతో మేలు. అటువంటి వాటిలో శంఖు పువ్వు అగ్రస్థానంలో ఉంటుంది. ఆకర్షణీయమైన నీలి రంగులో ఉండే ఈ పూలలో యాంటీ ఆక్సిడెంట్లు, ఆంథోసైనిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి, యవ్వనంగా ఉంచుతాయి. చర్మ సౌందర్యానికి శంఖు పువ్వును ఉపయోగించి తయారు చేసుకునే 4 సులువైన ఫేస్ ప్యాక్‌లు ఇక్కడ ఉన్నాయి.

మెరిసే చర్మం కోసం శంఖు పువ్వు ఫేస్ ప్యాక్స్..యవ్వనం ఎప్పుడూ మీ వెంటే..!
Butterfly Pea Flower Face Pack
Jyothi Gadda
| Edited By: |

Updated on: Oct 20, 2026 | 7:26 PM

Share

సహజసిద్ధమైన సౌందర్య సాధనాలలో శంఖు పువ్వు కీలక పాత్ర పోషిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు సమృద్ధిగా ఉండే ఈ పువ్వులు చర్మానికి అద్భుతమైన నిగారింపును ఇస్తాయి. వృద్ధాప్య లక్షణాలను తగ్గించి, చర్మం యవ్వనంగా కనిపించేలా చేయడంలో ఇది చాలా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా ఈ శంకు పువ్వు ఫేస్ ప్యాక్స్‌ను ముఖానికి వేసుకోవడం ద్వారా మొటిమలు తగ్గి, ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.

శంఖు పువ్వు, తేనె ఫేస్ ప్యాక్:

కొన్ని తాజా శంఖు పువ్వులను మెత్తగా పేస్ట్ చేసి, అందులో ఒక స్పూన్ స్వచ్ఛమైన తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. తేనె చర్మానికి తగిన తేమను అందించి కాంతివంతం చేస్తుంది.

అలోవెరా జెల్, శంఖు పువ్వు ప్యాక్:

శంఖు పువ్వుల పొడి లేదా రసంలో కొద్దిగా కలబంద జెల్ కలపాలి. దీన్ని ముఖానికి రాసుకుని మర్దన చేసుకోవాలి. ఎండ వల్ల దెబ్బతిన్న చర్మాన్ని ఇది ప్రశాంతపరుస్తుంది. మొటిమలు, మంటను తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

పెరుగు, శంఖు పువ్వు ప్యాక్:

శంఖు పువ్వుల రసాన్ని రెండు స్పూన్ల తాజా పెరుగుతో కలపాలి. పెరుగులోని లాక్టిక్ ఆమ్లం చర్మంపై ఉన్న మృతకణాలను తొలగిస్తుంది. శంఖు పువ్వులోని యాంటీ ఆక్సిడెంట్లు ముఖంపై ముడతలు రాకుండా అడ్డుకుంటాయి.

ముల్తానీ మట్టి, శంఖు పువ్వు ప్యాక్:

జిడ్డు చర్మం ఉన్నవారికి ఇది చాలా మంచిది. ముతానీ మట్టిలో శంఖు పువ్వుల కషాయం లేదా పొడి కలిపి పేస్ట్ చేయాలి. దీన్ని ముఖానికి రాసి పూర్తిగా ఆరిన తర్వాత కడిగేయాలి. ఇది అదనపు నూనెను తొలగించి, రంధ్రాలను శుభ్రం చేస్తుంది.

సహజసిద్ధమైన ఈ శంఖు పువ్వు ఫేస్ ప్యాక్స్‌ను వారానికి ఒకటి లేదా రెండుసార్లు క్రమం తప్పకుండా వాడుతుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ చర్మం సహజంగా, కాంతివంతంగా మెరుస్తుంది!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us