Beagle Puppy: ఈ కుక్క పిల్లను పెంచుకుంటున్నారా.. ఈ 10 విషయాలు తెలియడం తప్పనిసరి
బీగిల్ పప్పీని ఇంటికి తెచ్చుకునే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇవి అద్భుతమైన పెంపుడు జంతువులు అయినప్పటికీ, వాటికి ప్రత్యేక అవసరాలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవడం, తగిన సంరక్షణ అందించడం ముఖ్యం. ఈ పది విషయాలు బీగిల్ యజమానులకు ఉపయోగపడతాయి. ఈ విషయాలు తెలుసుకోకుండా ఈ పప్పీని ఇంటికి తెచ్చుకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

బీగిల్ పప్పీని ఇంటికి తెచ్చుకునే ముందు 10 ముఖ్య విషయాలు తెలుసుకోవాలి. బీగిల్స్ శునకాలు శక్తివంతంగా ఉంటాయి. అపార్ట్‌మెంట్లలో నివసించే వారు ఎక్కువగా వీటిని పెంచుకుంటారు. బీగిల్ పప్పీని ఇంటికి తీసుకురావడానికి ముందు వాటి ప్రవర్తన, అవసరాలకు సంబంధించి కొన్ని కీలక అంశాలను అర్థం చేసుకోవడం ముఖ్యం.
1. వాసన ద్వారా అన్వేషణ
బీగిల్స్ వాసన ఆధారంగా అన్వేషిస్తాయి. అవి వాసన పసిగడుతూ దూరం వెళ్ళిపోతాయి. కాబట్టి వాటిని తప్పనిసరిగా పట్టీ వేసి ఉంచాలి. లేకపోతే అవి సురక్షితమైన ప్రదేశాల్లో ఉంచాలి. అవి తప్పించుకు వెళ్ళకుండా ఇది అవసరం.
2. శబ్దాలు చేయడం
బీగిల్స్ చాలా శబ్దాలు చేస్తాయి. మొరగడం, అరుస్తూ ఉంటాయి. అపార్ట్‌మెంట్లలో నివసించే వారు దీనిని పరిగణించాలి. అవి తమ అసౌకర్యాన్ని, ఉత్సాహాన్ని శబ్దాల ద్వారా తెలియజేస్తాయి.
3. అధిక వ్యాయామం అవసరం
ఈ చురుకైన పప్పీలకు చాలా వ్యాయామం అవసరం. రోజూ నడవాలి. ఆట సమయం తప్పనిసరి. విసుగు చెందకుండా, విధ్వంసక ప్రవర్తన నివారించడానికి ఇది సహాయపడుతుంది.
4. తప్పించుకునే తత్వం
బీగిల్స్ “తప్పించుకునే కళాకారులు”. అవి కంచె కింద తవ్వగలవు. చిన్న గ్యాప్‌ల ద్వారా దూరి తప్పించుకుంటాయి. కాబట్టి ఇళ్ళు, పెరటి ప్రాంతాలను పప్పీ-ప్రూఫ్ చేయాలి.
5. ఆహారం పట్ల అధిక ప్రేమ
బీగిల్స్ ఆహారం పట్ల అధిక ప్రేమని ప్రదర్శిస్తాయి. ఇది శిక్షణకు సులభం ఐనా, అధికంగా తినడం, ఊబకాయానికి దారితీస్తుంది. కాబట్టి నియంత్రిత ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం తప్పనిసరి.
6. వెంట్రుకలు ఊడటం
వాటి బొచ్చు చిన్నది ఐనా, అవి చాలా వెంట్రుకలు రాలుస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా బ్రష్ చేయడం అవసరం. ఇది ఇంట్లో వెంట్రుకలు వ్యాపించకుండా నియంత్రిస్తుంది.
7. శిక్షణకు ఓర్పు అవసరం
బీగిల్స్‌కు శిక్షణ ఇవ్వడం ఓర్పు కావాల్సిందే. వాటి తెలివితేటలు, మొండితనం శిక్షణను సవాలుగా మారుస్తాయి. స్థిరమైన, సానుకూల శిక్షణ పద్ధతులు ఉత్తమం.
8. స్నేహం కోరుకునేవి
ఇవి గుంపు జంతువులు. స్నేహాన్ని కోరుకుంటాయి. ఎక్కువసేపు ఒంటరిగా వదిలివేస్తే, అవి వేరుపడుతున్నట్లు ఆందోళన చెందుతాయి. వాటికి తోడు ముఖ్యం.
9. ఆరోగ్య పరీక్షలు ముఖ్యం
బీగిల్స్‌కు చెవి ఇన్ఫెక్షన్లు, ఊబకాయం, కొన్ని జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించడం ముఖ్యం. ఇది వాటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
10. దీర్ఘకాలిక నిబద్ధత
బీగిల్ పప్పీని తెచ్చుకోవడం ఒక లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ లాంటిది. అవి 12-15 సంవత్సరాలు జీవించగలవు. స్థిరమైన ప్రేమ, సంరక్షణ కోరుతాయి. వాటి జీవితాంతం మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి.