5000 రెస్టారెంట్స్‌ను తొలగించిన జొమాటో

ముంబయి:ఈ మధ్యకాలంలో ప్రముఖ ఆహార సరఫరా సంస్థ జొమాటో తన కష్టమర్స్‌ను విపరీతంగా పెంచుకుంది. ఆకట్టుకునే  ఆఫర్లతో పాటు సంతృప్తికరమైన సేవలు అందిస్తుండటంతో పుడ్ లవర్స్ కూడా జొమాటోని ఎక్కువ ప్రిపర్ చేస్తున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశలో జొమాటో మరో అడుగు ముందుకేసింది.  ఫిబ్రవరిలో దాదాపు 5,000 రెస్టారెంట్లును తమ జాబితా నుంచి తొలగించినట్లు వెల్లడించింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను అందుకోలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడించింది. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ […]

  • Ram Naramaneni
  • Publish Date - 2:42 pm, Sat, 23 February 19
5000 రెస్టారెంట్స్‌ను తొలగించిన జొమాటో

ముంబయి:ఈ మధ్యకాలంలో ప్రముఖ ఆహార సరఫరా సంస్థ జొమాటో తన కష్టమర్స్‌ను విపరీతంగా పెంచుకుంది. ఆకట్టుకునే  ఆఫర్లతో పాటు సంతృప్తికరమైన సేవలు అందిస్తుండటంతో పుడ్ లవర్స్ కూడా జొమాటోని ఎక్కువ ప్రిపర్ చేస్తున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశలో జొమాటో మరో అడుగు ముందుకేసింది.  ఫిబ్రవరిలో దాదాపు 5,000 రెస్టారెంట్లును తమ జాబితా నుంచి తొలగించినట్లు వెల్లడించింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను అందుకోలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడించింది. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిబంధనలను పూర్తిగా అమలు చేస్తామని తెలిపింది. దేశంలోని 150 పట్టణాల్లో తమతో ఒప్పందం చేసుకొన్న సంస్థల్లో నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేస్తామని వెల్లడించింది.

దీనిపై జొమాటో సీఈవో మోహిత్‌ గుప్తా మాట్లాడుతూ ‘‘నిత్యం మా జాబితాలోకి కొత్తగా 400 రెస్టారెంట్లు వచ్చిచేరుతున్నాయి. ఈ నేపథ్యంలో రెస్టారెంట్ల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించడం చాలా కీలకం. మాతో అనుబంధం ఉన్న దాదాపు 80,000 రెస్టారెంట్లను మరోసారి పరిశీలించాలనుకుంటున్నాం. ఈ క్రమంలో ఆ రెస్టారెంట్లు నాణ్యతా ప్రమాణాలను అందుకొనేందుకు సాయం చేస్తాము.’’ అని వెల్లడించారు.