‘జస్టిస్ ఫర్ దిషా’.. ఇక ‘జీరో ఎఫ్‌ఐఆర్’కు శ్రీకారం చుడతారా.?

'జస్టిస్ ఫర్ దిషా'.. ఇక 'జీరో ఎఫ్‌ఐఆర్'కు శ్రీకారం చుడతారా.?

హైదరాబాద్ శివార్లలో డాక్టర్ ప్రియాంకారెడ్డిపై జరిగిన అత్యాచారం ఘటన యావత్తు భారతదేశాన్ని కుదిపేసిందని చెప్పాలి. సినీ ప్రముఖుల దగ్గర నుంచి యువత వరకు అందరూ కూడా నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ.. నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఇకపై ఇలాంటి కేసుల దర్యాప్తులో ఓ కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చే అవకాశం కనిపిస్తోంది. గతంలోనే ఈ రూల్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఇప్పటివరకు ఎక్కడా కూడా అమలులోకి రాలేదు. అయితే ప్రియాంకారెడ్డి మర్డర్ కేసు […]

Ravi Kiran

|

Dec 01, 2019 | 7:47 PM

హైదరాబాద్ శివార్లలో డాక్టర్ ప్రియాంకారెడ్డిపై జరిగిన అత్యాచారం ఘటన యావత్తు భారతదేశాన్ని కుదిపేసిందని చెప్పాలి. సినీ ప్రముఖుల దగ్గర నుంచి యువత వరకు అందరూ కూడా నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ.. నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఇకపై ఇలాంటి కేసుల దర్యాప్తులో ఓ కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చే అవకాశం కనిపిస్తోంది. గతంలోనే ఈ రూల్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఇప్పటివరకు ఎక్కడా కూడా అమలులోకి రాలేదు. అయితే ప్రియాంకారెడ్డి మర్డర్ కేసు నమోదులో పోలీసులు జాప్యం చేశారని ఆరోపణలు రావడంతో.. ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాని పేరే జీరో జీరో ఎఫ్‌ఐఆర్.. అంటే.. సంఘటనా స్థలం పరిధితో నిమిత్తం లేకుండా ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా.. ఫిర్యాదు చేయవచ్చు.. క్లుప్తంగా చెప్పాలంటే.. ఎఫ్‌ఐఆర్ విషయంలో ఇకపై హద్దులు లేనట్లే.

ఎఫ్‌ఐఆర్ నమోదు గురించి తెలుసుకుంటే…

పోలీసులు కేసు నమోదు చేసుకునే విషయంలో.. సంఘటనా స్థలం తమ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందా..? రాదా.? అన్నది ముందు చూస్తారు. ఒకవేళ తమ పరిధిలోకి రాకాపోతే.. ఫలానా స్టేషన్‌లో నమోదు చేయాలని బాధితులకు చెప్పి పంపిస్తారు. సాధారణంగా చిన్నాచితకా కేసుల్లో అయితే దీని వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ అత్యవసర కేసుల్లో అయితే.. ఈ రూల్ వల్ల నిండు ప్రాణాలే బలైపోతాయి. సరిగ్గా ప్రియాంకారెడ్డి కేసులో ఇదే జరిగింది. ప్రియాంకారెడ్డి ఆపదలో ఉన్నానని తన కుటుంబసభ్యులకు ఫోన్ చేసినప్పుడు.. వాళ్ళు పోలీసులకు సమాచారం తెలియజేయడానికి వెళ్లారు. శంషాబాద్ ఆర్జీఐఏ – శంషాబాద్ రూరల్ పోలీసులు తమ పరిధిలోకి రాదంటే.. తమ పరిధి కాదంటూ చేతులు దులుపుకున్నారు. పోలీసుల నిర్లక్ష్యానికి నలుగురి రాక్షసుల చేతిలో ఓ అబల ప్రాణాలు కోల్పోయింది. అటు ప్రియాంక తల్లిదండ్రులు కూడా పోలీసులు సమయానికి స్పందించకపోవడం వల్లే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే మళ్ళీ జీరో ఎఫ్‌ఐఆర్ తెరపైకి వచ్చింది.

జీరో ఎఫ్‌ఐఆర్ అంటే ఏంటి…

గతంలో నిర్భయ ఘటన జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం జీరో ఎఫ్‌ఐఆర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ప్రకారం పోలీసులు హద్దులనేవి లేకుండా ఎవరైనా ఫిర్యాదుకు వస్తే.. తప్పనిసరిగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సి వస్తుంది. ప్రతి ఎఫ్‌ఐఆర్‌కు ఒక సీరియల్ నంబర్ ఉంటుంది. అయితే నమోదైన ఎఫ్‌ఐఆర్ తమ ప్రాంతం, పరిధిలోనిది కాకపోతే.. నంబర్ లేకుండానే ఎఫ్‌ఐఆర్  నమోదు చేయాలి. దాన్నే జీరో ఎఫ్‌ఐఆర్ అంటారు. ఇలా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం వల్ల బాధితుల్లో ధైర్యం రావడమే కాకుండా అత్యవసర కేసుల్లో పోలీసులు సరైన సమయానికి వెళ్తే.. నిండు ప్రాణాలు బలికాకుండా ఆపవచ్చు. ఇకపోతే పోలీసుల ప్రాధమిక దర్యాప్తు అనంతరం కేసును సంబంధిత స్టేషన్‌‌‌కు బదిలీ చేసి.. వారికి నంబర్‌ను కేటాయించడం జరుగుతుంది. అప్పట్లో కేంద్రం ఈ జీరో ఎఫ్‌ఐఆర్‌కు ఆమోదం తెలిపినా.. దీనిపై ఏ రాష్ట్ర పోలీసులు కూడా సరిగ్గా శ్రద్ధ పెట్టలేదు. ప్రస్తుతం ముంబైలో ఈ విధానం అమలులో ఉంది. దీంతో హైదరాబాద్‌లో కూడా జీరో ఎఫ్‌ఐఆర్‌ను అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రియాంక కుటుంబసభ్యులు మాత్రమే కాకుండా న్యాయనిపుణులు, మహిళా సంఘాలు.. ఇలా అందరూ కూడా ఈ విధానాన్ని తేవాలని సూచిస్తున్నారు. మరి ఇప్పటికైనా ఈ జీరో ఎఫ్‌ఐఆర్‌ను అమలు చేస్తారో లేదో వేచి చూడాలి.

కాగా, ప్రియాంకారెడ్డి పేరును దిషాగా మార్చి.. ‘జస్టిస్ ఫర్ దిషా’ క్యాంపెయిన్‌ను అందరూ సహకరించాలని కోరారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu