గుంటూరులో మాదే ప్రభంజనం: మోదుగుల జోస్యం

వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ ప్రభంజనం సృష్టించబోతుందని.. జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డిలు గుంటూరులోని అన్ని నియోజకవర్గాల్లోనూ గెలవలేదని.. కానీ ఈ సారి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ గుంటూరులో 17 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలు గెలవబోతుందని ఆయన జోస్యం చెప్పారు. సర్వేలలో ఫలితాలు ఎలా […]

గుంటూరులో మాదే ప్రభంజనం: మోదుగుల జోస్యం
TV9 Telugu Digital Desk

| Edited By:

May 21, 2019 | 5:08 PM

వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ ప్రభంజనం సృష్టించబోతుందని.. జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డిలు గుంటూరులోని అన్ని నియోజకవర్గాల్లోనూ గెలవలేదని.. కానీ ఈ సారి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ గుంటూరులో 17 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలు గెలవబోతుందని ఆయన జోస్యం చెప్పారు. సర్వేలలో ఫలితాలు ఎలా ఉన్నా.. అసలైన ఫలితాన్ని ప్రజలు ఈ నెల 23న చూపిస్తారని ఆయన అన్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu