కడప జిల్లా : కొత్త ఏడాది కేక్ కటింగ్ వేళ పారిన నెత్తురు.! వైసీపీలోని ఇరు వర్గాల కత్తులు, రాళ్ల దాడులు, గన్ ఫైరింగ్
కడపజిల్లాలో కొత్త ఏడాదిలో మొదటిరోజున నెత్తురు పారింది. వైసీపీ నేతలు నిమ్మకాయల సుధాకర్ రెడ్డి, మహేశ్వర రెడ్డి వర్గీయులు మధ్య..
కడపజిల్లాలో కొత్త ఏడాదిలో మొదటిరోజున నెత్తురు పారింది. వైసీపీ నేతలు నిమ్మకాయల సుధాకర్ రెడ్డి, మహేశ్వర రెడ్డి వర్గీయులు మధ్య ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరింది. దీంతో పరస్పరం దాడులు చేసుకున్నారు. మహేశ్వర రెడ్డి వర్గీయులు కత్తులతో, రాళ్లతో నిమ్మకాయల సుధాకర్ రెడ్డి వర్గీయుులపై దాడులకు పాల్పడ్డారు. దీంతో సుధాకర్ రెడ్డి వర్గీయుల్లో ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో లైసెన్స్డ్ గన్ తో గాలిలోకి ఫైరింగ్ చేశారు నిమ్మకాయల సుధాకర్ రెడ్డి. దాడిలో తీవ్ర గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.