రఘురామకృష్ణంరాజుకు వైసీపీ షోకాజ్ నోటీసులు..

గత కొద్దిరోజులుగా అధికార వైసీపీలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వైసీపీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 

  • Ravi Kiran
  • Publish Date - 2:08 pm, Wed, 24 June 20
రఘురామకృష్ణంరాజుకు వైసీపీ షోకాజ్ నోటీసులు..

గత కొద్దిరోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారుతున్న సంగతి తెలిసిందే. పార్టీలో కుల రాజకీయాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన కామెంట్స్ సంచలనంగా మారడమే కాకుండా, ఎమ్మెల్యేలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనితో తాజాగా వైసీపీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అనేక సందర్భాల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆ నోటీసులలో పేర్కొంది. అంతేకాకుండా ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలకు కూడా వారంలోగా వివరణ ఇవ్వాలని తెలిపింది. లేని పక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా, ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ రఘురామకృష్ణంరాజుకు మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. తనకు వైసీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తల నుంచి ప్రాణహాని ఉందని ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాసిన సంగతి విదితమే.