నేడు నాంపల్లి కోర్టుకి వైఎస్ విజయమ్మ, షర్మిల
ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన కేసులో నేడు నాంపల్లి కోర్టులో వైఎస్ విజయమ్మ, షర్మిల హాజరుకానున్నారు. కోర్టుకి హాజరు కావాలని నాంపల్లి ప్రత్యేక కోర్ట్ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఈ హాజరు తప్పనిసరైంది. 2012 లో పరకాల ఉపఎన్నికల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా విజయమ్మ, షర్మిల రోడ్డు షో నిర్వహించినట్టు కేసు నమోదైన సంగతి తెలిసిందే. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, కొండా మురళి పై కూడా కేసు విచారణలో ఉంది. ఈ కేసులో […]
ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన కేసులో నేడు నాంపల్లి కోర్టులో వైఎస్ విజయమ్మ, షర్మిల హాజరుకానున్నారు. కోర్టుకి హాజరు కావాలని నాంపల్లి ప్రత్యేక కోర్ట్ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఈ హాజరు తప్పనిసరైంది. 2012 లో పరకాల ఉపఎన్నికల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా విజయమ్మ, షర్మిల రోడ్డు షో నిర్వహించినట్టు కేసు నమోదైన సంగతి తెలిసిందే. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, కొండా మురళి పై కూడా కేసు విచారణలో ఉంది. ఈ కేసులో ఈ నలుగురు కచ్చితంగా విచారణకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఇప్పటికే ఆదేశాలిచ్చింది.