చైనీస్ వ్యాక్సీన్ కి బ్రెజిల్ బ్రేక్, అసలేమైంది ?
చైనీస్ వ్యాక్సీన్ 'కరోనా వ్యాక్ ' క్లినికల్ ట్రయల్స్ ని బ్రెజిల్ నిలిపివేసింది. ఈ వ్యాక్సీన్ తీసుకున్న వాలంటీర్లలో ఒకరరు గత నెల 29 న ఏదో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని బ్రెజిల్ హెల్త్ రెగ్యులేటర్ ' అన్ విసా ' తెలిపింది.
చైనీస్ వ్యాక్సీన్ ‘కరోనా వ్యాక్ ‘ క్లినికల్ ట్రయల్స్ ని బ్రెజిల్ నిలిపివేసింది. ఈ వ్యాక్సీన్ తీసుకున్న వాలంటీర్లలో ఒకరరు గత నెల 29 న ఏదో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని బ్రెజిల్ హెల్త్ రెగ్యులేటర్ ‘ అన్ విసా ‘ తెలిపింది. అతని ఆరోగ్యం ఎలా క్షీణించిందో తెలియడంలేదని ఈ సంస్థ పేర్కొంది. బహుశా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఉండవచ్చు..లేదా ఇంకేదో సీరియస్ ప్రాబ్లం అయి ఉండవచ్చు.. ఏ విషయం ప్రైవసీ కారణంగా చెప్పలేం అని అన్ విసా ప్రకటించింది. చాలా అడ్వాన్స్ దశలో ఉన్న వాలంటీర్లలో ఒకరికి ఇలా కొత్త సమస్య తలెత్తడంతో బ్రెజిల్ లో చైనీస్ వ్యాక్సీన్ కి బ్రేక్ పడింది. అసలైన కారణాన్ని త్వరలోనే వెల్లడిస్తామని ఈ హెల్త్ రెగ్యులేటరీ పేర్కొంది.