దుబ్బాక వరుసగా తొలి ఐదు రౌండ్‌లలో ఆధిక్యంలో బీజేపీ
సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు ముగిసిన వరుసగా మొదటి ఐదు రౌండ్లలో జరిగిన కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 20,226 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి సుజాత కు 17,559 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డికి 3,254 ఓట్లు లభించాయి. తొలి రౌండ్‌లో బీజేపీ 341, రెండవ రౌండ్‌లో 279, మూడో […]

సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు ముగిసిన వరుసగా మొదటి ఐదు రౌండ్లలో జరిగిన కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 20,226 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి సుజాత కు 17,559 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డికి 3,254 ఓట్లు లభించాయి. తొలి రౌండ్‌లో బీజేపీ 341, రెండవ రౌండ్‌లో 279, మూడో రౌండ్‌లో 750 ఓట్ల.. ఇలా వరుసగా ఐదు రౌండ్లలోనూ బీజేపీ తన ఆధిపత్యాన్ని చాటుతూ వస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత రెండో స్థానంలో ఉన్నారు. అందరి అంచనాల ప్రకారం టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత ముందంజలో ఉంటారని భావించినప్పటికీ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యం దిశగా సాగుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయమైంది.