5

పుదుచ్చేరిలో ఘోరం.. బాలికల గ్యాంగ్ రేప్

పుదుచ్చేరిలో ఘోరకలి వెలుగులోకి వచ్చింది. చిన్నారుల చేత వెట్టిచాకిరీ చేయించుకోవడమేకాదు, వాళ్లని లైంగికంగా వేధిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రోజూ పదిమందికి పైగా వారిపై సామూహిక అత్యాచారాలకు పాల్పడినట్టు తేలింది. స్థానిక కోర్కాడు చెరువు సమీపంలో బాతుల పెంపకం ఫాంలో వివిధ ప్రాంతాలకు చెందిన కొందరు చిన్నారుల చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. వీరిలో శివగంగై జిల్లాకు చెందిన ఐదుగురు బాలికలు ఉన్నారు. ఫాంలో పనిపూర్తికాగానే ఈ అయిదుగురిని బయటకు వెళ్లే వీలులేకుండా ఒక గదిలో […]

పుదుచ్చేరిలో ఘోరం.. బాలికల గ్యాంగ్ రేప్
Follow us

|

Updated on: Nov 10, 2020 | 11:38 AM

పుదుచ్చేరిలో ఘోరకలి వెలుగులోకి వచ్చింది. చిన్నారుల చేత వెట్టిచాకిరీ చేయించుకోవడమేకాదు, వాళ్లని లైంగికంగా వేధిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రోజూ పదిమందికి పైగా వారిపై సామూహిక అత్యాచారాలకు పాల్పడినట్టు తేలింది. స్థానిక కోర్కాడు చెరువు సమీపంలో బాతుల పెంపకం ఫాంలో వివిధ ప్రాంతాలకు చెందిన కొందరు చిన్నారుల చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. వీరిలో శివగంగై జిల్లాకు చెందిన ఐదుగురు బాలికలు ఉన్నారు. ఫాంలో పనిపూర్తికాగానే ఈ అయిదుగురిని బయటకు వెళ్లే వీలులేకుండా ఒక గదిలో బంధించి ఈ ఐదుగురిపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఒక స్వచ్ఛంద సేవా సంస్థకు సమాచారం అందడంతో ఫాంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అయిదుగురు చిన్నారులను పోలీసులు రక్షించారు. పుదుచ్చేరి బాలల సంక్షేమ సంఘం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఫాంహౌస్ యజమానితోపాటు, ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన 10 మంది చిన్నారులపై సామూహిక లైంగిక దాడులకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.