AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నదిలోకి దిగిన యువతి కాళ్ల దగ్గర ఏదో కదులుతూ కనిపించింది.. పైకి లాగి చూడగా

నదిలో సరదాగా స్నానం చేయడానికి వెళ్లినయువతికి ఒక వింత అనుభవం ఎదురైంది. నీటిలో ఏదో కదులుతుంటే చేప అనుకొని ఉత్సాహంగా చేతుల్లోకి తీసుకున్న యువతి, అది మొసలి పిల్ల అని తెలిసి ఒక్కసారిగా హడలిపోయింది. భయంతో దానిని వెంటనే నీటిలో వదిలేసి ఒడ్డుకు పరుగులు తీసింది.

Viral Video: నదిలోకి దిగిన యువతి కాళ్ల దగ్గర ఏదో కదులుతూ కనిపించింది.. పైకి లాగి చూడగా
Viral Video
Ravi Kiran
|

Updated on: Apr 16, 2026 | 1:27 PM

Share

సరదాగా నదిలో స్నానం చేద్దామని వెళ్లిన ఆ యువతికి అస్సలు ఊహించని అనుభవం ఎదురైంది. నీటిలో ఏదో కదులుతుంటే చేప అనుకొని పట్టుకున్న ఆమెకు, తీరా అది మొసలి పిల్ల అని తెలియడంతో పై ప్రాణం పైనే పోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వింత ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం ఎండలు మండిపోతుండటంతో చాలామంది నదులు, కాలువల వద్దకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యువతి స్థానిక నదిలో స్నానం చేయడానికి వెళ్ళింది. నీటిలో కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో, కాళ్ల దగ్గర ఏదో చిన్న జీవి కదులుతున్నట్లు గమనించింది. అది చూసేందుకు చేప పిల్లలా ఉండటంతో, ఆ యువతి ఎంతో ఉత్సాహంగా దానిని తన చేతుల్లోకి తీసుకుంది.

ఇది చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఓయో వెళ్లినప్పుడు పోలీస్ రైడ్ జరిగితే.! ఈ ఒక్క మాట చెప్పండి మీ జోలికి రారు

ఆ చిన్న జీవిని చేతిలోకి తీసుకోగానే ఆ యువతికి ఏదో తేడాగా అనిపించింది. దాని శరీరం గరుకుగా ఉండటం, తోక ఆకారం భిన్నంగా ఉండటంతో నిశితంగా గమనించింది. అది చేప కాదని, మొసలి పిల్ల అని తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. ఒక్కసారిగా భయాందోళనకు గురైన ఆ యువతి గట్టిగా అరుస్తూ ఆ మొసలి పిల్లను నీటిలో వదిలేసి ఒడ్డుకు పరుగులు తీసింది. ఈ వీడియో పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ అయింది. “దేవుడా.. ఎంత ప్రమాదం తృటిలో తప్పింది”, “మొసలి పిల్ల ఉందంటే కచ్చితంగా తల్లి మొసలి దగ్గరలోనే ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి” అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆ యువతి అమాయకత్వాన్ని చూసి నవ్వుకుంటున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓ సారి వీడియోపై లుక్కేయండి.

ఇది చదవండి: ఒక బ్యాడ్ న్యూస్.. రెండు గుడ్ న్యూస్‌లు.! హైదరాబాద్ ఊపిరి పీల్చుకో.. కాటేరమ్మ కొడుకు వచ్చేస్తున్నాడు..

Follow Us