ప్రియురాలు చనిపోయిందని ఒకరు… ప్రేయసికి పెళ్లైందని ఇంకొకరు…

ప్రేమ కోసం ప్రాణాలు తీసుకుంటున్నారు యువకులు. ప్రియురాలు చనిపోయిందనే బాధలో ఒకరు చనిపోతే.. ప్రేయసికి పెళ్లి అయిందని ఇంకొకరు ప్రాణాలు తీసుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రెండు బలవన్మరణాలు పండగ పూట వారి కుటుంబాల్లో విషాదం నింపాయి.

ప్రియురాలు చనిపోయిందని ఒకరు... ప్రేయసికి పెళ్లైందని ఇంకొకరు...
Sanjay Kasula

|

Oct 25, 2020 | 9:25 PM

Lives for Love :  ప్రేమ కోసం ప్రాణాలు తీసుకుంటున్నారు యువకులు. ప్రియురాలు చనిపోయిందనే బాధలో ఒకరు చనిపోతే.. ప్రేయసికి పెళ్లి అయిందని ఇంకొకరు ప్రాణాలు తీసుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రెండు బలవన్మరణాలు పండగ పూట వారి కుటుంబాల్లో విషాదం నింపాయి.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కుదురుపల్లికి చెందిన మహేశ్‌ ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇటీవల ఆ యువతి అనారోగ్యంతో మృతి చెందింది. ఆ వేధన తట్టుకోలేక.. తీవ్రంగా మనస్తాపం చెందాడు మహేశ్‌. ప్రేయసి లేని లోకంలో తాను ఉండలేనంటూ.. ఆమె దగ్గరికే వెళ్లిపోతానంటూ.. జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియురాలి సమాధి వద్ద ఉన్న చెట్టుకే మహేశ్‌ ఉరి వేసుకొని చనిపోవడం అతని ప్రేమకు నిదర్శనం.

అటు.. చిత్తూరు జిల్లాలోనూ దాదాపు ఇలాంటి ఘటనే. చంద్రగిరి మండలం తొండవాడకు చెందిన సునీల్‌.. ప్రేమ విఫలంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ప్రేమించిన యువతికి వారం రోజుల క్రితం వివాహం జరగడంతో.. ఆ విరహ వేధనను సునీల్‌ తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనస్తాపంతో ఉరి వేసుకొని సూసైడ్‌ చేసుకున్నాడు.

మహేశ్‌, సునీల్‌ల మరణాలు యువకుల్లో పెరుగుతున్న ఆత్మహత్య ధోరణికి ఉదాహారణలు. ప్రేయసి చనిపోయిందని ఒకరు.. లవర్‌కు వేరొకరితో మ్యారేజ్‌ అయిందని ఇంకొకరు.. ఆ ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. పోయిన ప్రేయసి ఎలానూ పోయింది.. చేతికొచ్చిన కొడుకు చనిపోవడంతో ఇప్పుడు ఆ రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కుటుంబ సభ్యులకు కడుపు కోత మిగల్చడం మినహా.. ఆత్మహత్యలతో ఆ యువకులు ఏం సాధించినట్టు?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu