AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుట్టినరోజు నాడే యువతి ఆత్మహత్య, రీజన్ ఏంటంటే?

చిన్న, చిన్న అపార్థాలు..క్షణికావేశాలతో ప్రస్తుతం యువత ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటువంటి ఘటనే జరిగింది.

పుట్టినరోజు నాడే యువతి ఆత్మహత్య, రీజన్ ఏంటంటే?
Ram Naramaneni
|

Updated on: Sep 09, 2020 | 1:36 PM

Share

చిన్న, చిన్న అపార్థాలు..క్షణికావేశాలతో ప్రస్తుతం యువత ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటువంటి ఘటనే జరిగింది. తన బర్త్ డే రోజు అమ్మ, అన్న శుభాకాంక్షలు చెప్పలేదన్న మనస్తాపంతో యువతి సూసైడ్ చేసుకుంది. దీంతో కొద్ది వయస్సులోనే భర్తను కోల్పోయినా, ఎన్నో సమస్యలు ఎదుర్కుంటూ ఇద్దరు పిల్లల జీవితాలను తీర్చిదిద్దేందుకు పోరాడుతున్న మహిళకు కడుపుకోత మిగిలింది.

వివరాల్లోకి వెళ్తే.. కొత్తగూడెం తిలక్‌నగర్‌కు చెందిన ధనలక్ష్మి భర్త సుధీర్‌సింగ్‌ 11 ఏళ్ల కిందట యాక్సిడెంట్ లో ప్రాణాలు విడిచాడు. అప్పటి నుంచి ధనలక్ష్మి… కొడుకు మౌర్య రాహుల్‌, కూతురు మౌర్య నైనా(18)లను పెంచి పెద్దవాళ్లను చేసింది. తల్లికి తోడుగా రాహుల్‌ సింగరేణి సంస్థలో కార్పెంటర్‌ విధులు నిర్వహిస్తూ వచ్చే జీతంతో కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. మంగళవారం మౌర్య నైనా బర్త్ డే కావడంతో సర్‌ప్రైజ్‌గా చేద్దామని తల్లీ, అన్న ప్లాన్ చేసుకున్నారు. దీంతో ఉదయం ఆమెకు శుభాకాంక్షలు కూడా చెప్పకుండా వారి, వారి డ్యూటీలకు వెళ్లిపోయారు. దీంతో అమ్మ, అన్న తనను పట్టించుకోలేదన్న మనస్తాపంతో మౌర్య లేఖ రాసిపెట్టి ఇంట్లోనే ఉరేసుకుని తనువు చాలించింది.

సాయంత్రం ఇంటికొచ్చేసరికి మౌర్య ఫ్యాన్ కు వేలాడటం చూసి తల్లి, అన్న షాకయ్యారు. ఘనంగా బర్త్‌డే పార్టీ చేద్దామని ప్లాన్ చేసుకుంటే లైఫులో మరిచిపోలేని షాకిచ్చావంటూ మౌర్య మృతదేహం వద్ద కన్నీరు పెట్టుకున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కొత్తగూడెం టూటౌన్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read :

కొండెక్కిన చికెన్ ధరలు

Follow Us
కేంద్రం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. వారికి అదనంగా సిలిండర్ల సరఫరా
కేంద్రం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. వారికి అదనంగా సిలిండర్ల సరఫరా
చిరంజీవి సినిమా.. నిధులు మొత్తం రైతులకు ఇచ్చేశాం..
చిరంజీవి సినిమా.. నిధులు మొత్తం రైతులకు ఇచ్చేశాం..
వంటింట్లో ఎక్కువ క్రిములు ఉండేది ఇందులోనే.. మార్చకపోతే ప్రమాదమే!
వంటింట్లో ఎక్కువ క్రిములు ఉండేది ఇందులోనే.. మార్చకపోతే ప్రమాదమే!
ఊరికి వెళ్తున్నారా? మొక్కలు ఎండిపోతాయని చింత వద్దు.. ఈ ట్రిక్ తో
ఊరికి వెళ్తున్నారా? మొక్కలు ఎండిపోతాయని చింత వద్దు.. ఈ ట్రిక్ తో
వైభవ్ వర్సెస్ బుమ్రా.. ఐపీఎల్‌లో అసలైన యుద్ధం మొదలైంది
వైభవ్ వర్సెస్ బుమ్రా.. ఐపీఎల్‌లో అసలైన యుద్ధం మొదలైంది
ఇంటర్ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఫలితాల విడుదల తేదీలు మార్పు
ఇంటర్ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఫలితాల విడుదల తేదీలు మార్పు
మీ టీ జల్లెడ మురికిగా మారిందా?ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి
మీ టీ జల్లెడ మురికిగా మారిందా?ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి
ఎన్టీఆర్ కు ఉన్న సత్తా మరెవరికీ లేదు.. సీనియర్ నటుడు..
ఎన్టీఆర్ కు ఉన్న సత్తా మరెవరికీ లేదు.. సీనియర్ నటుడు..
కేకేఆర్ వికెట్లు పడుతుంటే బాద్‌షా టెన్షన్ మామూలుగా లేదు
కేకేఆర్ వికెట్లు పడుతుంటే బాద్‌షా టెన్షన్ మామూలుగా లేదు
అల్లు అర్జున్ జీవితాన్నే మలుపు తిప్పిన సినిమా ఏదో తెలుసా?
అల్లు అర్జున్ జీవితాన్నే మలుపు తిప్పిన సినిమా ఏదో తెలుసా?