Yes Bank Crisis: ‘ఎస్ బ్యాంక్’ దెబ్బ.. వినియోగదారులకు షాకిచ్చిన ఫోన్‌పే…
Yes Bank Crisis: ఎస్ బ్యాంక్ సంక్షోభంలో పడిపోయింది. దీనితో ఒక్కసారిగా డిపాజిటర్లు, ఇన్వెస్టర్లలో భయం నెలకొంది. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే.. వారంతా బ్యాంకులు, ఏటీఎంల వద్ద తమ డబ్బులను విత్‌డ్రా చేసుకునేందుకు క్యూ కట్టారు. అయితే ఆ విత్ డ్రా లిమిట్‌పై ఆర్బీఐ పలు షరతులను విధించింది. అకౌంట్ హోల్డర్లు అంతా ఒకేసారి డబ్బులు విత్ డ్రా చేస్తే.. మరింత సంక్షోభంలోకి బ్యాంకు వెళ్లాల్సి వస్తుందన్న ఉద్దేశంతో.. ఏప్రిల్ 3వ తేదీ వరకు […]
Yes Bank Crisis: ఎస్ బ్యాంక్ సంక్షోభంలో పడిపోయింది. దీనితో ఒక్కసారిగా డిపాజిటర్లు, ఇన్వెస్టర్లలో భయం నెలకొంది. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే.. వారంతా బ్యాంకులు, ఏటీఎంల వద్ద తమ డబ్బులను విత్‌డ్రా చేసుకునేందుకు క్యూ కట్టారు. అయితే ఆ విత్ డ్రా లిమిట్‌పై ఆర్బీఐ పలు షరతులను విధించింది. అకౌంట్ హోల్డర్లు అంతా ఒకేసారి డబ్బులు విత్ డ్రా చేస్తే.. మరింత సంక్షోభంలోకి బ్యాంకు వెళ్లాల్సి వస్తుందన్న ఉద్దేశంతో.. ఏప్రిల్ 3వ తేదీ వరకు ఒక్కో అకౌంట్ హోల్డర్.. కేవలం రూ. 50 వేలు వరకు మాత్రమే డబ్బులు తీసుకునేలా.. అంతకుమించి వీల్లేకుండా నిషేధం విధించింది.
ఇదిలా ఉంటే ఎస్ బ్యాంక్ సంక్షోభం దెబ్బ ఇప్పుడు ప్రముఖ ఆన్లైన్ పేమెంట్స్ యాప్ ‘ఫోన్ పే’పై పడింది. ఎస్ బ్యాంక్‌తో ఫోన్ పే ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ యాప్‌లో డబ్బు చెల్లింపులు అన్నీ కూడా ఆ బ్యాంక్ ద్వారానే జరుగుతాయి. దీనితో గురువారం రాత్రి నుంచి ఫోన్ పే సర్వీసులన్నీ నిలిచిపోయాయి. అంతేకాకుండా సర్వీసులను తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు ఫోన్ పే చీఫ్ ఎగ్జిక్యూటివ్ సమీర్ నిగమ్ కూడా ట్వీట్ చేశారు. దీనితో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, ఎస్ బ్యాంక్‌తో తమకు ఉన్న భాగస్వామ్యం వల్లే ఈ సమస్య ఎదురైందని.. త్వరలోనే సేవలను తిరిగి ప్రారంభిస్తామని ఫోన్ పే సంస్థ స్పష్టం చేసింది. ఇక ఇవాళ ఉదయం నుంచి ఫోన్ పే సర్వీసెస్ ప్రారంభమయ్యాయని తెలుస్తున్నా.. ఇంకా కొందరు కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
For More News:
బాన్సువాడలో దారుణం.. ముగ్గురు కూతుళ్లను హత్య చేసిన తండ్రి..
ఆడబిడ్డకు జన్మనిచ్చిన దిశ నిందితుడి భార్య…
మోదీ సర్కార్ సంచలనం.. ఆ రెండు ఛానళ్లపై నిషేధం…
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. నోటిఫికేషన్ విడుదల
బిగ్ బ్రేకింగ్: ఏపీలో పదో తరగతి పరీక్షలకు కొత్త షెడ్యూల్
తిరుమలలో అపచారం.. వెంకన్న సాక్షిగా వాళ్లు ఏం చేశారంటే..?
విజయ్ దేవరకొండ హీరోయిన్ ఎగ్ దోశలు.. వీడియో వైరల్..
హైపర్ ఆది సంచలన నిర్ణయం.. జబర్దస్త్ నుంచి దొరబాబు, పరదేశీలు.?
సఫారీ సిరీస్… పగ్గాలు చేపట్టనున్న హిట్‌మ్యాన్.. హార్దిక్, ధావన్‌ల రీ-ఎంట్రీ ఖరారు.!
Dear @PhonePe_ customers. We sincerely regret the long outage. Our partner bank (Yes Bank) was placed under moratorium by RBI. Entire team’s been working all night to get services back up asap. We hope to be live in a few hours. Thanks for your patience. Stay tuned for updates!
— Sameer.Nigam (@_sameernigam) March 6, 2020
And we’re back! pic.twitter.com/vJW23jLgTn
— PhonePe (@PhonePe_) March 6, 2020