AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్నూలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో వర్గపోరు..!

కర్నూలు జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో వర్గపోరు మొదలయ్యింది.. మంత్రి అనిల్‌కు, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌కు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎమ్మెల్యే ఆర్ధర్‌ అనుచరులు బహిరంగంగానే నీటిపారుదల శాఖ మంత్రి

కర్నూలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో వర్గపోరు..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Feb 28, 2020 | 4:48 PM

Share

కర్నూలు జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో వర్గపోరు మొదలయ్యింది.. మంత్రి అనిల్‌కు, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌కు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎమ్మెల్యే ఆర్ధర్‌ అనుచరులు బహిరంగంగానే నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. నందికొట్కూరు రాజకీయాలలో జోక్యం చేసుకుంటే కర్నూలులో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు. నేరస్తులు, హంతకులకు భయపడేవారెవ్వరూ ఇక్కడ లేరన్నారు. అనిల్‌ ఎక్కడ కనిపించినా అడ్డగిస్తామన్నారు ఆర్థర్‌ అనుచరులు.

ఈ హెచ్చరికలన్నీ ఆర్థర్‌ సమక్షంలోనే కార్యకర్తలు చేయడం గమనార్హం… నందికొట్కూరు రాజకీయాలను పార్టీ అధిష్టానం నిశితంగా గమనిస్తోంది.. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే ఆర్థర్‌కు సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి మధ్య మొదట్నుంచి విభేదాలున్నాయి. విద్యా వాలంటీర్ల నియామకం మొదలు ఇప్పటి వరకు అనేక విషయాల్లో ఇద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి.

తాజాగా నందికొట్కూరు మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ నియామకం విషయంలో కూడా ఆర్థర్‌- సిద్ధార్థ్‌రెడ్డి గొడవ పడ్డారు. కర్నూలు జిల్లాకు ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా ఉన్న అనిల్‌కుమార్‌ ..సిద్ధార్థ్‌రెడ్డి పక్షం వహిస్తున్నారన్నది ఆర్థర్‌ వర్గం ప్రధాన ఆరోపణ. అందుకే గత కొద్ది రోజులుగా అనిల్‌పై ఆర్థర్‌ అనుచరులు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇరువర్గాల మధ్య విభేదాలు పీక్‌కు చేరాయి… మరి అధిష్టానం ఇద్దరి మధ్య ఎలా సయోధ్య కుదిరిస్తుందో చూడాలి మరి.

Follow Us
విద్యార్ధులకు అలర్ట్.. తెలంగాణ SET 2026 నోటిఫికేషన్ వచ్చేసింది!
విద్యార్ధులకు అలర్ట్.. తెలంగాణ SET 2026 నోటిఫికేషన్ వచ్చేసింది!
కాళ్ల నొప్పి, తిమ్మిరికి ఈ ఒక్క చెంచా చాలు.. పూర్తి రిలీఫ్
కాళ్ల నొప్పి, తిమ్మిరికి ఈ ఒక్క చెంచా చాలు.. పూర్తి రిలీఫ్
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ఎందుకు..? వామ్మో.. ఆర్బీఐ ప్లాన్ చూస్తే
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ఎందుకు..? వామ్మో.. ఆర్బీఐ ప్లాన్ చూస్తే
మొదటి క్రికెట్ స్టేడియం ఎక్కడ నిర్మించారు? ఇప్పటికీ ఉందా?
మొదటి క్రికెట్ స్టేడియం ఎక్కడ నిర్మించారు? ఇప్పటికీ ఉందా?
పంజాబ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థిని మృతి.. క్యాంపస్‌లో..
పంజాబ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థిని మృతి.. క్యాంపస్‌లో..
అదృష్టం మారడం ఖాయం.. బుధ సంచారంతో వీరికి లక్కే లక్కు
అదృష్టం మారడం ఖాయం.. బుధ సంచారంతో వీరికి లక్కే లక్కు
వామ్మో...వరుసగా 14 రోజులు అవకాడో తింటే శరీరంలో ఏం జరుగుతుందంటే..
వామ్మో...వరుసగా 14 రోజులు అవకాడో తింటే శరీరంలో ఏం జరుగుతుందంటే..
అప్పుడు టీవీ ఛానెల్ యాంకర్.. ఇప్పుడు కోట్ల ఆస్తులకు యువరాణి
అప్పుడు టీవీ ఛానెల్ యాంకర్.. ఇప్పుడు కోట్ల ఆస్తులకు యువరాణి
ఈ ఫొటోలో ఉన్న అమ్మడిని గుర్తుపట్టారా.?
ఈ ఫొటోలో ఉన్న అమ్మడిని గుర్తుపట్టారా.?
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కీలక అప్‌డేట్..!
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కీలక అప్‌డేట్..!