ఆపిల్ కరోనా టూల్‌ తయారికి ఢిల్లీ విద్యార్థి ఎంపిక..!

ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఆపిల్ నిర్వహించి కాంపిటిషన్ లో భారతీయ విద్యార్థికి చోటు దక్కింది. ఆపిల్‌ చాలేంజ్‌లో పాల్గొని కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే టూల్‌ను తయారు చేసినందుకు ఢిల్లీకి చెందిన తనేజా ఎంపికయ్యాడు.

ఆపిల్ కరోనా టూల్‌ తయారికి ఢిల్లీ విద్యార్థి ఎంపిక..!
Follow us
Balaraju Goud

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 18, 2020 | 5:18 PM

ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఆపిల్ నిర్వహించి కాంపిటిషన్ లో భారతీయ విద్యార్థికి చోటు దక్కింది. ఆపిల్‌ చాలేంజ్‌లో పాల్గొని కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే టూల్‌ను తయారు చేసినందుకు ఢిల్లీకి చెందిన తనేజా ఎంపికయ్యాడు. ఆపిల్‌ సంస్థ తన వరల్డ్‌ వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ (WWDC) స్విఫ్ట్ స్టూడెంట్‌ రివార్డుకు పలాష్‌ తనేజా ఎంపికయ్యాడు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా నిర్వాహించిన పోటీల్లో మొత్తం 41 దేశాలకు చెందిన 350 మంది ఈ రివార్డ్‌కు ఎంపికయ్యారు. ఈ నెల 22 న సరికొత్త వర్చువల్‌ ఫార్మాట్‌లో తొలిసారిగా ప్రారంభంకానున్న డబ్ల్యూడబ్ల్యూడీసీలో పలాష్‌ తనేజా పాల్గొంటారు. ఆపిల్ ఫార్మట్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.3 లక్షల మంది ఈ కాన్ఫరెన్న్ లో జాయిన్‌ కానున్నారు. ఢిల్లీకి చెందిన ఈ పందొమ్మిదేండ్ల పలాష్ తనేజా.. ఆస్టిన్‌లోని టెక్సాస్‌ యూనివర్సిటీ నుంచి ఫ్రెష్‌మాన్‌ కోర్సును ఈ ఏడాదే పూర్తి చేశారు. నాలుగేండ్ల క్రితం డెంగ్యూ వ్యాధితో బాధపడ్డ తనేజా.. తనలా ఇబ్బందిపడకూడదని ప్రత్యేక టూల్‌ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. డెంగ్యూ వ్యాధి తనను ప్రేరేపించడంతో.. ఆపిల్‌ చాలేంజ్‌లో పాల్గొని కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అనే టూల్‌ను తయారుచేసినట్లు తనేజా చెప్పాడు. మహమ్మారి ఇంతగా మనల్ని వేధిస్తున్నప్పటికీ చాలామంది సరైన జాగ్రత్తలు పాటించకపోవడాన్ని గమనించి ఈ టూల్‌ తయారుచేశానంటున్నాడు. కేవలం టెక్నాలజీకే పరిమితం కాకుండా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఇంగ్లిష్‌, గణితం నేర్పేందుకు ట్యూషన్లు చెప్తుంటారు. అమెరికా వెళ్లడానికి ముందు 40 భాషల్లోకి ఆన్‌లైన్‌ వీడియోలను తర్జుమా చేసే ప్రోగ్రాంను సిద్ధం చేశాడు. పలాష్‌ తనేజాతోపాటు 19 ఏండ్ల సోఫియా ఓంజీల్‌, 18 ఏండ్ల డెవిన్‌ గ్రీన్‌ కూడా డబ్ల్యూడబ్ల్యూడీసీకి ఎంపికయ్యారు.