పూరీ ఆలయ సేవకులు 50 మందికి కరోనా

కరోనా వైరస్ ప్రభావం పూరి జగన్నాథ ఆలయంపై పడింది. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కేంద్రం పూరీ జగన్నాథ స్వామి టెంపుల్ ను తెరిచేందుకు అనుమతినిచ్చింది. దీంతో ఆలయానికి వచ్చి పోయే సంఖ్య గణనీయంగా పెరిగింది.

పూరీ ఆలయ సేవకులు 50 మందికి కరోనా
Follow us

|

Updated on: Sep 07, 2020 | 3:19 PM

కరోనా వైరస్ ప్రభావం పూరి జగన్నాథ ఆలయంపై పడింది. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కేంద్రం పూరీ జగన్నాథ స్వామి టెంపుల్ ను తెరిచేందుకు అనుమతినిచ్చింది. దీంతో ఆలయానికి వచ్చి పోయే సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ కారణంగా ఇప్పటి వరకు సుమారు 50 మంది వైరస్‌ పాజిటివ్‌గా నిర్థారించారు. క్రమంగా రోజు కరోనా బారిన పడుతున్న వారిసంఖ్య పెరుగుతోందని ఆలయ నిర్వాహకుడు అజయ్‌కుమార్‌ జెనా పేర్కొన్నారు. రథయాత్ర తర్వాత ఆలయ సేవలకు కూడా కరోనా వైరస్‌ సోకినట్లుగా భావిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా, రథయాత్రకు ముందు పరిపాలన సేవకులు, వారి కుటుంబాలకు కొవిడ్‌-19 పరీక్షలు రెండుసార్లు నిర్వహించారు. అలాగే రోగనిరోధక శక్తిని పెంచే హోమియోపతి ఔషధాన్ని సేవకులకు పంపిణీ చేశారు. అయినప్పటికీ, తాజా నిర్వహించిన పరీక్షల్లో వారిలో కొందరి కరోనా పాజిటివ్ సోకినట్లు ఆయన తెలిపారు.

అలాగే, త్రిమూర్తుల రోజువారీ ఆచారాలను పాటించకుండా చూసేందుకు, సేవలకు వైరస్‌ సోకకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని అజయ్‌కుమార్‌ తెలిపారు. కరోనా బారిన పడిన సేవకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఆలయ పరిపాలన విభాగం. ఇందుకోసం ఒక హోటల్ ను అద్దెకు తీసుకుని కొవిడ్‌ సెంటర్‌గా మార్చింది. చాలా మంది సీనియర్‌ సేవకులు పాజిటివ్‌గా పరీక్షించగా.. 30 గదులున్న హోటల్‌ ఇప్పుడు నిండిపోయింది. కాగా. వంద గదులు ఉన్న ఆలయానికి చెందిన హోటల్‌ నీలాచల్‌ భక్త నివాస్‌ను కొవిడ్‌ కేర్‌ ఫెసిలిటీగా మార్చేందుకు ఆలయ పరిపాలన విభాగం నిర్ణయించిందని అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఇక, జిల్లాలో ఇప్పటి వరకు 4,423 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, ఇందులో పూరిలోనే 1,580 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.