ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి జోరు తగ్గినా.. అగ్రరాజ్యాన్ని వణికిస్తోంది..మరణాల్లో టాప్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టినా.. అమెరికాలో మాత్రం తీవ్రంగా విజృంభిస్తోంది. కరోనా కట్టడికి అక్కడ ఎన్ని చర్యలు చేపట్టినా.. పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరుగుతుండటంతో
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టినా.. అమెరికాలో మాత్రం తీవ్రంగా విజృంభిస్తోంది. కరోనా కట్టడికి అక్కడ ఎన్ని చర్యలు చేపట్టినా.. పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరుగుతుండటంతో మరింత కలవరపెడుతోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా నిన్న కొత్తగా 5,26,135 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కొత్తగా 7,523 మంది మరణించారు. ఇక మొత్తం కేసుల సంఖ్య7,26,18,391 చేరింది. ఇక మొత్తం మరణాలు 16,18,437 సంభవించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రికవరీ కేసులు 5,08,41,045 ఉండగా, యాక్టివ్ కేసుల సంఖ్య 2,01,58,911కు చేరాయి. వాటిలో 1,06,130 కేసుల్లో కరోనా తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా సోకిన వంద మందిలో ఇద్దరు చనిపోతున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది.
అమెరికాలో… ఇక అమెరికా విషయానికొస్తే.. కొత్తగా 1,79,174 కేసులు నమోదు కాగా, నిన్న ఒక్క రోజే 1347 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు అమెరికాలో 1,67,28,550కి చేరగా, మరణాల సంఖ్య 3,06,429కి చేరింది. ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్‌లో కొనసాగుతోంది. భారత్, రష్యా, ఫ్రాన్స్, బ్రెజిల్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
ఇక రోజువారీగా పరిశీలిస్తే కొత్త కేసుల్లో అమెరికా తర్వాత రష్యా, భారత్, టర్కీ, బ్రెజిల్ ఉన్నాయి. మొత్తం మరణాల్లో చూస్తే అమెరికా మొదటి స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా మరణాల్లో అమెరికా తర్వాత బ్రెజిల్, భారత్, మెక్సికో, ఇటలీ ఉన్నాయి. రోజువారీ మరణాల్లో అమెరికా టాప్‌లో ఉంది. ఆ తర్వాత మెక్సికో, రష్యా, ఇటలీ, భారత్ ఉన్నాయి.
భారత్‌లో..
ఇక భారత్‌లో కొత్తగా 30,254 కేసులు నమోదు కాగా, 391 మంది మరణించారు. ఇప్పటి వరకు భారత్‌లో 98 లక్షలు దాటిపోయింది. ఇక మరణాలు 1,43,019కి చేరాయి. తాజాగా భారత్‌లో కరోనా నుంచి 33,136 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 93,57,464కు చేరింది. ప్రస్తుతం 3,56,546 యాక్టివ్ కేసులున్నట్లు భారత ఆరోగ్య సంస్థ తెలిపింది.
తెలంగాణలో..
తెలంగాణలో కరోనా అప్‌డేట్: తగ్గుముఖం పడుతుందనే చెప్పాలి. ఒకప్పుడు 2 వేల వరకు పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం ఆ సంఖ్య 500లకు పడిపోయింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 384 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముగ్గురు మరణించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,78,108 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,496 మంది మరణించారు. తాజాగా కోలుకున్నవారి సంఖ్య 631 ఉండగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,69,232 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.53 శాతం ఉండగా, దేశంలో 1.5 శాతం ఉంది. అలాగే రికవరీ రేటు రాష్ట్రంలో 96.80 శాతం ఉండగా, దేశంలో 95 శాతం ఉన్నట్లు ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 7,380 ఉండగా, హోం ఐసోలేషన్లో 5,298 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా అత్యధికంగా జీహెచ్ఎంసీలో 101 కేసులు నమోదయ్యాయి.
ఏపీలో..
ఇక ఏపీలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. నిన్న ఒక్క రోజు 506 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు. ఏపీలో ఇప్పటి వరకు 8,75,531 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7,057 మంది కరోనా బారిన పడి మరణించారు. ఇక కోలుకున్నవారి సంఖ్య 8,63,506 కోలుకున్నారు. అలాగే రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 996 ఉన్నట్లు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇలా ప్రపంచంలోనే కాకుండా దేశంలో కూడా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. కరోనా కట్టడికి వ్యాక్సిన్ తయారీలో భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు సైతం తలమునకలవుతున్నాయి. ప్రస్తుతం వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ఎలాంటి మార్గం లేదు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వల్ల కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవచ్చు.