తెలంగాణలో కరోనా అప్‌డేట్: తగ్గుముఖం పడుతున్న కరోనా మహమ్మారి.. తాజాగా ఎన్ని కేసులంటే
తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా 2 వేల వరకు పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. కరోనా కట్టడిలో భాగంగా కేసుల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం
తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా 2 వేల వరకు పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. కరోనా కట్టడిలో భాగంగా కేసుల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టగా, మరణాల సంఖ్య కూడా తగ్గిపోయింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 384 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముగ్గురు మరణించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,78,108 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,496 మంది మరణించారు. తాజాగా కోలుకున్నవారి సంఖ్య 631 ఉండగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,69,232 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.53 శాతం ఉండగా, దేశంలో 1.5 శాతం ఉంది. అలాగే రికవరీ రేటు రాష్ట్రంలో 96.80 శాతం ఉండగా, దేశంలో 95 శాతం ఉన్నట్లు ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 7,380 ఉండగా, హోం ఐసోలేషన్లో 5,298 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా అత్యధికంగా జీహెచ్ఎంసీలో 101 కేసులు నమోదయ్యాయి.