అరెస్టును అడ్డుకుని హంగామా చేసిన మహిళలు

చోరీ కేసులో అభియోగాలెదుర్కుంటున్న ఓ మహిళను అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులను అడ్డుకోవడమే కాకుండా నడిరోడ్డు మీద హంగామా చేసిన మహిళల ఉదంతమిది. ఒంగోలు ఇస్లాంపేటలో...

అరెస్టును అడ్డుకుని హంగామా చేసిన మహిళలు
Follow us

|

Updated on: Oct 22, 2020 | 3:29 PM

Women hulchal before police vehicle: చోరీ కేసులో అభియోగాలెదుర్కుంటున్న ఓ మహిళను అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులను అడ్డుకోవడమే కాకుండా నడిరోడ్డు మీద హంగామా చేసిన మహిళల ఉదంతమిది. ఒంగోలు ఇస్లాంపేటలో ఓ మహిళను అరెస్టు చేసేందుకు వచ్చిన కర్నూలుకు చెందిన పోలీసులు రావడంతో వారిని అడ్డుకునేందుకు స్థానిక మహిళలు నడిరోడ్డు మీద హంగామా సృష్టించారు. ఓ చోరీ కేసులో నిందితుడు బంగారాన్ని మహిళకు ఇచ్చాడన్న అభియోగంతో ఆమెను అదుపులోకి తీసుకున్న కర్నూలు పోలీసులు కారులో తీసుకెళ్ళేందుకు ప్రయత్నించారు.

మహిళా కానిస్టేబుల్‌ లేకుండా, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మహిళను కర్నూలు ఎలా తీసుకెళతారంటూ అడ్డుకున్న కొందరు మహిళలు.. కారుకు అడ్డంగా నిలబడి ఆందోళన చేశారు. వాస్తవానికి మహిళను ఇతర ప్రాంతాలకు విచారణ నిమిత్తం తీసుకెళ్ళాలంటే మహిళా పోలీసులు ఉండాలి. ఈ నిబంధనను సాకుగా చూపుతూ పోలీసులను దుర్భాషలాడిన మహిళలు.. వాహనాన్ని అక్కడే నిలిపి వేశారు.

పోలీసు వాహనం టైర్లకు అడ్డంగా ఇసుక బస్తాలు వేసి అడ్డుకున్నారు. మహిళను అక్రమంగా ఎలా తీసుకెళతారని స్థానిక మహిళలు, యువకులు కర్నూలు పోలీసులకు అడ్డం తిరిగారు. దీంతో కొద్దిసేపు హంగామా ఏర్పడింది. సమాచారం అందుకున్న ఒంగోలు టూటౌన్‌ సిఐ రాజేష్‌ జోక్యం చేసుకుని మహిళను టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో విచారించాలని, చట్టపరంగా వ్యవహరించాలని కర్నూలు పోలీసులకు సూచించారు. చట్ట ప్రకారం కర్నూలు పోలీసులు వ్యవహరిస్తారని స్థానికులకు సిఐ రాజేష్‌ సర్దిచెప్పడంతో మహిళలు ఆందోళన విరమించారు. అనంతరం ఒంగోలు పీయస్‌లో మహిళను కర్నూలు పోలీసులు విచారించారు.

Also read:  అమరావతిలో స్తబ్దత.. రాజధానిపై చంద్రబాబు కీలక ట్వీట్

Also read: పొద్దుటూరులో భారీ గోల్డ్ గోల్‌మాల్

Also read: “నాగ్” మిసైల్ ప్రయోగం సక్సెస్