నగర శివారులో దారుణం.. పాదాలు నరికి సగం కాలిన మహిళ శవం

|

Sep 29, 2020 | 5:18 PM

హైదరాబాద్ శివారులో దారుణం జరిగింది. సగం కాలిపోయిన స్థితిలో మహిళ మృతదేహం రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపుతోంది.

నగర శివారులో దారుణం.. పాదాలు నరికి సగం కాలిన మహిళ శవం
Follow us on

హైదరాబాద్ శివారులో దారుణం జరిగింది. సగం కాలిపోయిన స్థితిలో మహిళ మృతదేహం రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపుతోంది. ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగుచూసింది. పాదాలు నరికిన మహిళ మృతదేహం మంటల్లో సగం కాలిపోయిన స్థితిలో లభ్యమైంది. వనస్థలిపురంలోని సాహెబ్ నగర్ కు చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. కాళ్లకున్న వెండి కడియాలకోసం మహిళను దారుణంగా హతమార్చినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

కాగా, వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని సాహెబ్ నగర్‌కు చెందిన మైసమ్మ (60) నివాసముంటోంది. వంట మనిషిగా కూలీ పనిచేస్తున్న మైసమ్మ ఇంటి నుంచి పనికి వెళ్లి తిరిగి రాకపోవడంతో సోమవారం సాయంత్రం వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఇదిలావుంటే ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలో లభించిన మృతదేహాన్ని మైసమ్మదిగా గుర్తించారు. మైసమ్మను కాళ్లకు వెండి కడియాల కోసం హత్య చేసి, కాళ్లు నరికి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు చెప్పారు.