దీపావళి రానుంది.. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే ఆర్ధిక వృద్ది !

దేశంలో ఇక ఫెస్టివల్ సీజన్ రానుంది. అతి పెద్ద పండుగలైన దసరా, దీపావళి, ఆ తరువాత క్రిస్మస్.. ఇలా ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగలివి ! అయితే ఆర్ధిక నిపుణుల అంచనా ప్రకారం.. ఈ పండుగల సీజన్ లో చూడబోతే ‘ స్లంప్ ‘ తప్ప మరేమీ కనిపించడం లేదు. దేశ ఆర్ధిక వృద్ది రేటు గత ఏప్రిల్-జూన్… మూడు నెలల కాలానికి 25 శాతం తగ్గిపోయిందట. జీడీపీలో ఇది దాదాపు 60 శాతమని లెక్కలు చెబుతున్నాయి. వివిధ […]

దీపావళి రానుంది.. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే ఆర్ధిక వృద్ది !
Follow us

| Edited By:

Updated on: Sep 17, 2019 | 1:30 PM

దేశంలో ఇక ఫెస్టివల్ సీజన్ రానుంది. అతి పెద్ద పండుగలైన దసరా, దీపావళి, ఆ తరువాత క్రిస్మస్.. ఇలా ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగలివి ! అయితే ఆర్ధిక నిపుణుల అంచనా ప్రకారం.. ఈ పండుగల సీజన్ లో చూడబోతే ‘ స్లంప్ ‘ తప్ప మరేమీ కనిపించడం లేదు. దేశ ఆర్ధిక వృద్ది రేటు గత ఏప్రిల్-జూన్… మూడు నెలల కాలానికి 25 శాతం తగ్గిపోయిందట. జీడీపీలో ఇది దాదాపు 60 శాతమని లెక్కలు చెబుతున్నాయి. వివిధ రంగాల్లో ప్రజల కొనుగోలు శక్తి క్రమేపీ క్షీణీస్తోంది. 2008.. 09 లో ప్రపంచ వ్యాప్త ఆర్ధిక సంక్షోభం అనంతరం నెలకొన్నస్థితి కన్నా ఇది మరింత ‘ దారుణంగా ‘ ఉందని ఓ విశ్లేషణలో తేలింది. ‘ఫెస్టివ్ సీజన్ లో ప్రజల కొనుగోలు శక్తి పెరగాలంటే ఆర్ధిక పునరుజ్జీవం తప్పనిసరి. ఈ సీజన్ లో ఏడాదికి 35 నుంచి 40 శాతం వివిధ వస్తువుల అమ్మకాలు చాలావరకు పెరగాల్సి ఉంది. ముఖ్యంగా ఈ పదేళ్లలో ఈ దీపావళికి ఈ ‘ శక్తి ‘ పెరగడమన్నది దేశ ఎకానమీకి ఎంతో ముఖ్యం. ఇది పెరగని పక్షంలో ఆర్ధిక స్థితి మరింత దిగజారుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వారి అంచనా ప్రకారం.. వ్యాల్యూ గ్రోత్ రేటు 2008 లో 19 శాతం ఉండగా.. 2010 నాటికి అది 18 శాతానికి, 2017 నాటికి 14 శాతానికి, 2018 నాటికి 13. 8, ఈ ఏడాది జనవరి-మార్చి నాటికి 13. 4, ఏప్రిల్-జూన్ నాటికి 10 శాతం తగ్గిపోయింది. మొత్తానికి ఈ ఏడాదికి ఇది తొమ్మిది నుంచి 10 శాతం ఉంది. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి పెరుగుదల 2008 లో వ్యాల్యూ 9.1 శాతం, వ్యాల్యుమ్ 9.4 శాతం, 2009 లో 9.1, 2010 లో 10.4, 10.5, 2017 లో 6.5, 17, 2018 లో 6.4, 7.5, ఈ ఏడాది జనవరి-జూన్ నాటికి ఒకే ఒక్క శాతం, వ్యాల్యూమ్ 2 శాతం ఉండగా ఈ నాటికి వ్యాల్యూ ఒక శాతం నుంచి సున్నా వరకు, వ్యాల్యుమ్ 1. 2 శాతం ఉన్నట్టు లెక్కలు తేలాయి. హోమ్ అప్లయన్సెస్ (గృహోపకరణాల) విషయంలో అమ్మకాల పెరుగుదల2008 లో 10.6, 9.4, 2009 లో 18, 14.3, 2010 లో 18, 13.9, 2017 లో 12.8, 7.6, 2018 లో 12, 7.5, ఈ ఏడాది జనవరి-జూన్ నాటికి 19, 15 శాతం, నేటికీ వ్యాల్యూ తొమ్మిది నుంచి పదకొండు శాతం ఉన్నాయి.

ఫోన్ల విషయానికి వస్తే మొబైల్ ఫోన్ల అమ్మకాలు కేవలం 2010 లోనే పెరిగాయి. కానీ 2017 నాటికి 37 శాతానికి, 2018 నాటికి 11 శాతానికి తగ్గిపోయాయి.ఈ ఏడాది ఇది ఇప్పటివరకు 10 శాతం మాత్రమే ఉంది. స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు 5 శాతం తగ్గాయి. ఫీచర్ ఫోన్ల పరిస్థితి కూడా దాదాపు డిటో. ఆటో రంగానికి సంబంధించి 2008… 2018 మధ్య కాలానికి అశోక్ లీలాండ్, మారుతి సుజుకీ, బజాజ్ ఆటో, హీరో మోటార్స్ టీవీఎస్ మోటార్ సేల్స్ వ్యాల్యూ ఒక దశలో హెచ్చుతూ, మరో దశలో తగ్గుతూ వచ్చింది. ప్రభుత్వం ఇప్పటివరకూ ప్రకటిస్తున్న ప్యాకేజీలు ఈ పండుగల సీజన్ లో ప్రజల కొనుగోలు శక్తిపై ప్రభావం చూపనున్నాయి. అయితే ఇది అనుమానమే.. వివిధ కంపెనీలు ఇస్తున్న ప్రోత్సాహాకాలకు సాధారణ, పేద ప్రజలు ఎంతవరకు స్పందిస్తారన్నది కూడా ఓ ప్రశ్నే.. ఈ దీపావళికి డిమాండ్ పెరగకపోతే రాబోయే కాలంలో దేశ ఆర్ధిక పరిస్థితి మరింత క్షీణించవచ్చు.

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..