ఎవరు అధ్యక్షుడవుతారో చెప్పలేం, ఓటమిని పరోక్షంగా అంగీకరిస్తున్న డోనాల్డ్ ట్రంప్, మెత్తబడినట్టేనా ?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని చవి చూసిన డొనాల్డ్ ట్రంప్ కాస్త మెత్తబడ్డారు. దాదాపు తన ఓటమిని అంగీకరిస్తున్నట్టు పరోక్షంగా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎవరి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని చవి చూసిన డొనాల్డ్ ట్రంప్ కాస్త మెత్తబడ్డారు. దాదాపు తన ఓటమిని అంగీకరిస్తున్నట్టు పరోక్షంగా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎవరి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో చెప్పలేం అన్నారు. ఎవరు ప్రెసిడెంట్ అవుతారో ఎవరికి తెలుసు అని వేదాంతం వల్లించారు. మరో ప్రభుత్వమే రావచ్ఛు. కాలమే నిర్ణయిస్తుంది అని వ్యాఖ్యానించారు. కానీ బైడెన్ ప్రభుత్వం అని చెప్పడానికి మాత్రం ఆయన జంకారు. వైట్ హౌస్ లోని రోజ్ గార్డెన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశంలో మళ్ళీ లాక్ డౌన్ విధించడాన్ని తాను అనుమతించబోనన్నారు. కరోనా వైరస్ అదుపునకు ఆరు వారాల పాటు లాక్ డౌన్ విధించాలన్న బైడెన్ సలహాదారుల్లో ఒకరి ప్రతిపాదనను ట్రంప్ వ్యతిరేకించారు. వచ్ఛే ఏడాది ఏప్రిల్ లో అమెరికన్లందరికీ కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని ట్రంప్ చెప్పారు. అమెరికాలో మళ్ళీ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు.ఏది ఏమైనా ఆయన ఇంత నిరాశావాదిగా మాట్లాడడం ఇదే మొదటిసారి.