AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెహవిష్‌తో పీకల్లోతు ప్రేమలో దావూద్‌ ఇబ్రహీం

ముంబాయిలో ఉన్నంత కాలం బాలీవుడ్‌ హీరోయిన్లతో సంబంధాలు పెట్టుకున్నాడు.. హీరోయిన్లు కూడా భయంతో కాదనలేకపోయేవారు. ఇప్పుడూ.. 64 ఏళ్ల వయసులోనూ ఓ పాక్‌ సినీనటితో ప్రేమాయణం ఒలకబోస్తున్నాడు అండర్‌వరల్డ్‌ డాన్.

మెహవిష్‌తో పీకల్లోతు ప్రేమలో దావూద్‌ ఇబ్రహీం
Balu
|

Updated on: Aug 26, 2020 | 12:08 PM

Share

సాధారణంగా అండర్‌వరల్డ్‌ డాన్‌లు అమ్మాయిలకు దూరంగా ఉంటారు.. దావూద్‌ ఇబ్రహీం మాత్రం అలా కాదు.. అన్ని దుర్గుణాలతో పాటు ఈ అవలక్షణమూ ఉంది.. 1993లో ముంబాయిలో వరుస పేలుళ్లు సంభవించడానికి ముందు వరకు ఇతగాడు అక్కడే ఉన్నాడు.. ఆ పేలుళ్లకు పాల్పడిన దుష్టుడు ఇతడే! ఆ తర్వాత ఇక్కడ్నుంచి పారిపోయి ఉగ్రవాదులకు స్వర్గధామమైన పాకిస్తాన్‌ పంచన చేరాడు.. ముంబాయిలో ఉన్నంత కాలం బాలీవుడ్‌ హీరోయిన్లతో సంబంధాలు పెట్టుకున్నాడు.. హీరోయిన్లు కూడా భయంతో కాదనలేకపోయేవారు.

సరే ఇప్పుడూ …64 ఏళ్ల వయసులోనూ ఓ పాక్‌ సినీనటితో ప్రేమాయణం ఒలకబోస్తున్నాడు.. మూడేళ్లుగా మెహవిష్‌ హయత్‌ అనే సినీనటితో సంబంధం నెరపుతున్నాడనే వార్త గుప్పుమంది.. మొన్నీమధ్యనే పాకిస్తాన్‌ ప్రభుత్వం 2019 సంవత్సరానికిగాను ఆమెకు తమ్‌గా ఏ ఇంతియాజ్‌ అనే ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించింది. సినీ ఇండస్ట్రీలో ఈమె పెద్దగా పొడిచిందేమీ లేదు.. హీరోయిన్‌గా ఒరగబెట్టింది కూడా ఏమీ లేదు.. మరి ఈమెకు అవార్డు రావడమేమిటా అన్న సందేహం చాలా మందికి కలిగింది.. దావుద్‌తో సంబంధాలు పెట్టుకున్నదనే విషయం తెలిసాక సందేహం తీరింది.. దావూద్‌ గట్టిగా పట్టుబట్టి పెద్ద పెద్ద సినిమాల్లో ఆఫర్లు వచ్చేలా చేస్తున్నాడట కూడా! దావూద్‌ చెప్పాక కూడా ఆమెను సినిమాల్లో తీసుకోకుండా ఎలా ఉంటారు? కరాచీలోని ఓ విలాసవంతమైన భవనంలో హాయిగా కాలం వెల్లదీస్తున్న ఈ రసికశిఖామణి మెహవిష్‌ కోరికలన్నీ తీరుస్తున్నాడట! ఆమెకు కూడా ఓ ఖరీదైన బంగ్లా కొనిపెట్టాడట! దావూద్‌ పేరు చెప్పుకుని చక్కగా బతికేస్తున్నదట!

బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఒక్కమాట చెప్పకుండా టీమిండియా నుంచి తీసేశారు
ఒక్కమాట చెప్పకుండా టీమిండియా నుంచి తీసేశారు
సంక్రాంతికి మటన్ కొనేముందు ఇవి పక్కా తెలుసుకోండి.. లేకపోతే..
సంక్రాంతికి మటన్ కొనేముందు ఇవి పక్కా తెలుసుకోండి.. లేకపోతే..
ఈ బ్యాంకులో రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తే మీకు ఎంత వడ్డీ వస్తుంది?
ఈ బ్యాంకులో రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తే మీకు ఎంత వడ్డీ వస్తుంది?
చరిత్ర సృష్టించేందుకు రోహిత్ శర్మ రెడీ.. జస్ట్ 38 చాలు భయ్యో
చరిత్ర సృష్టించేందుకు రోహిత్ శర్మ రెడీ.. జస్ట్ 38 చాలు భయ్యో