గ్రామాలను కభళిస్తున్న కరోనా వైరస్ !

కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. పచ్చని గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కలకలం రేపుతోంది. ఆరు నెలల కిందట నగరాలకే పరిమితమైన కరోనా వైరస్ ఇప్పుడు పల్లెలను కభళిస్తోంది. దేశవ్యాప్తంగా 584 రూరల్‌ జిల్లాల్లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. మెట్రోల నుంచి వలసలు, వైరస్‌ వ్యాప్తితో గ్రామీణ ప్రాంతాల్లో ఈ నెలలోనే ఒక్కసారిగా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది.

గ్రామాలను కభళిస్తున్న కరోనా వైరస్ !

కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. పచ్చని గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కలకలం రేపుతోంది. ఆరు నెలల కిందట నగరాలకే పరిమితమైన కరోనా వైరస్ ఇప్పుడు పల్లెలను కభళిస్తోంది. దేశవ్యాప్తంగా 584 రూరల్‌ జిల్లాల్లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. మొన్నటివరకూ మెట్రో సిటీస్‌లోనే పాజిటివ్‌ కేసులు పెరిగాయి. కానీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మెట్రోల నుంచి వలసలు, వైరస్‌ వ్యాప్తితో గ్రామీణ ప్రాంతాల్లో ఈ నెలలోనే ఒక్కసారిగా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది.

ఏప్రిల్‌ నెలల్లో గ్రామీణ ప్రాంతాల్లో 22.7 శాతం కరోనా కేసులు మాత్రమే ఉండేవి. ఇదే సమయంలో అర్బన్‌ ఏరియాల్లో 64 శాతం కేసులు కనిపించేవి. సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో 14 శాతం ఉండేవి. అయితే నాలుగు నెలల్లో పూర్తిగా వైరస్‌ రూట్‌ మారింది. ఆగస్ట్‌ నెలల్లో పల్లెల్లో కేసులు పెరిగాయి. దాదాపు 55 శాతం కేసులు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో నమోదు అవుతున్నాయి. ఇదే టైమ్‌లో అర్బన్‌ ఏరియాల్లో 29 శాతానికి కేసులు తగ్గాయి. అర్బన్‌, రూరల్‌ కలిపిన ప్రాంతాల్లో 16 శాతం నమోదు అవుతున్నాయి.

ఏప్రిల్‌ నెలల్లో నమోదైన కరోనా కేసుల్లో ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల వాటా 28.5 శాతం. ఈనెలలో చూసుకుంటే ఈ మూడు నగరాల్లో నమోదైన కేసులు కేవలం 5.8 శాతం మాత్రమే. ఈ మూడు మెట్రో నగరాల్లో పెరిగిన పరీక్షలతో పాటు ఇతర జాగ్రత్తలు తీసుకోవడంతో కేసులు సంఖ్య తగ్గాయి.

మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరగడంతో ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. ప్రస్తుతం కరోనా ల్యాబ్‌లు అన్నీ పట్టణాల్లో ఉన్నాయి. టెస్ట్‌ శాంపిల్స్‌ తీసుకుని..నగరాలకు తీసుకువచ్చి రిజల్ట్స్‌ ప్రకటించే వరకూ చాలా టైమ్‌ పట్టనుంది. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడం కూడా ఓ సమస్యగా మారింది. అయితే రూరల్‌ ఏరియాల్లో జనసాంద్రత తక్కువగా ఉండడం వల్ల వైరస్‌ వ్యాప్తిని కంట్రోల్ చేసే అవకాశం వుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. జిల్లాలో మొత్తం 52వేలకు పైగా కేసులు నమోదైతే, అందులో యాక్టివ్‌ కేసులు 17వేల 750. ఇప్పటివరకూ 343 మంది కరోనాతో చనిపోయారు. ఆతర్వాత చిత్తూరులో 31వేల 292 కేసులు రిపోర్టు అయ్యాయి. మహారాష్ట్ర నాసిక్‌లో ప్రస్తుతం 11 వేలకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దాదాపు 90 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతం ఉన్న ఈ జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

Click on your DTH Provider to Add TV9 Telugu