AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో ప్రైవేట్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్లపై సర్కార్ కొరడా !

విజయవాడ స్వర్ణప్యాలెస్‌ దుర్ఘటన నేపథ్యంలో ప్రైవేట్ కోవిడ్‌ కేర్ సెంటర్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కోవిడ్ సెంటర్‌లపై ఏపీ ప్రభుత్వ కొరడా ఝులిపిస్తోంది. సరైన సదుపాయలు లేని, పేషెంట్ల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటోంది.

ఏపీలో ప్రైవేట్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్లపై సర్కార్ కొరడా !
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 26, 2020 | 11:32 AM

Share

విజయవాడ స్వర్ణప్యాలెస్‌ దుర్ఘటన నేపథ్యంలో ప్రైవేట్ కోవిడ్‌ కేర్ సెంటర్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కోవిడ్ సెంటర్‌లపై ఏపీ ప్రభుత్వ కొరడా ఝులిపిస్తోంది. సరైన సదుపాయలు లేని, పేషెంట్ల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటోంది.

విజయవాడలో ఐదు ప్రైవేట్‌ కోవిడ్‌ కేర్ సెంటర్లకు గతంలో ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించడమేగాకుండా, అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రమేష్‌ ఆస్పత్రి నిర్వహిస్తున్న స్వర్ణ హైట్స్‌, డాక్టర్‌ లక్ష్మీ నర్సింగ్‌ హోమ్‌ వారి ఎనికేపాడులోని హోటల్‌ అక్షయ, బ్రిటిష్‌ హాస్పిటల్‌ వారు నిర్వహిస్తున్న బెంజిసర్కిల్‌లోని హోటల్‌ ఐరా, ఎన్నారై హీలింగ్‌ హ్యాండ్స్‌, ఆంద్రా హాస్పిటల్‌ వారి సన్‌ సిటీ, కృష్ణ మార్గ్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్లకు అనుమతులు రద్దు చేసినట్లు తెలుస్తోంది.

నగరంలోని రోగుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకే ఈ ఐదు కోవిడ్‌ కేర్‌ సెంటర్లకు గతంలో ఇచ్చిన అనుమతులు రద్దు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే తాజాగా స్వర్ణప్యాలెస్‌ ఘటనపై విచారణ సందర్భంగా హైకోర్టు.. తనిఖీలు చేసి అనుమతులు ఇచ్చిన అధికారులను ఎందుకు ఈ కేసులో నిందితులుగా చేర్చలేదని ప్రశ్నించిన నేపథ్యంలో అధికారులు ఈ తక్షణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఆగస్టు 9న విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌లో భారీ అగ్నిప్రమాదం జరగడంతో 10 మంది మరణించారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాద జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. తాజాగా బుధవారం ఉదయం అనంతపూర్‌లోని సర్వజన ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. మంటల్లో పలు రికార్డులు, ఫర్నిచర్ కాలిపోయింది. అయితే సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ఆస్పత్రుల్లో వరుస ప్రమాదాల నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కోవిడ్ సెంటర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రాష్టంలో మరికొన్ని చోట్ల కూడా నిబంధనలకు విరుద్దంగా పనిచేస్తున్న కోవిడ్‌ కేర్ సెంటర్ల అనుమతులను రద్దు చేసే దిశగా ప్రభుత్వం పయనిస్తోంది.

Follow Us
OTTలో అదరగొడుతోన్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 8.2 రేటింగ్
OTTలో అదరగొడుతోన్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 8.2 రేటింగ్
పుట్టిన తేదీని బట్టి సంబంధాల్లో మీ తీరు ఎలా ఉంటుందో తెలుసా?
పుట్టిన తేదీని బట్టి సంబంధాల్లో మీ తీరు ఎలా ఉంటుందో తెలుసా?
కలర్ తోనే మతి పోగొట్టేస్తున్న రాయల్ ఎన్ ఫీల్డ్
కలర్ తోనే మతి పోగొట్టేస్తున్న రాయల్ ఎన్ ఫీల్డ్
అక్టోబర్ 1లోపు కేవైసీ పూర్తి చేయకపోతే గ్యాస్ బంద్..! క్లారిటీ ఇదే
అక్టోబర్ 1లోపు కేవైసీ పూర్తి చేయకపోతే గ్యాస్ బంద్..! క్లారిటీ ఇదే
వాట్సాప్ లో ఈ ట్రిక్స్ ఉన్నట్టు చాలా మందికి తెలీదు
వాట్సాప్ లో ఈ ట్రిక్స్ ఉన్నట్టు చాలా మందికి తెలీదు
పోలీస్ స్టేషన్‌లోనే పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు
పోలీస్ స్టేషన్‌లోనే పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు
కరెంట్ లేకపోయినా ఈ 4 మార్గాల్లో ఫోన్ ఛార్జ్ చేయొచ్చు
కరెంట్ లేకపోయినా ఈ 4 మార్గాల్లో ఫోన్ ఛార్జ్ చేయొచ్చు
పెళ్లి సంబంధాలు పదేపదే చెడిపోతున్నాయా? పితృ దోషం కావచ్చంటున్న..
పెళ్లి సంబంధాలు పదేపదే చెడిపోతున్నాయా? పితృ దోషం కావచ్చంటున్న..
కొత్త థార్‌లో ఇన్ని మార్పులు ఉన్నాయా? వివరాలు ఇవే
కొత్త థార్‌లో ఇన్ని మార్పులు ఉన్నాయా? వివరాలు ఇవే
ఏపీలో పింఛన్ల కోసం ఎదురుచూసేవారికి అలర్ట్.. ఈ సారి ఆలస్యం..
ఏపీలో పింఛన్ల కోసం ఎదురుచూసేవారికి అలర్ట్.. ఈ సారి ఆలస్యం..