‘జబర్దస్త్’‌లో సుడిగాలి సుధీర్ కనిపించడా..!

ఓ ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమవుతోన్న జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2013లో ప్రారంభమైన ఈ షో 7 సంవత్సరాలుగా

'జబర్దస్త్'‌లో సుడిగాలి సుధీర్ కనిపించడా..!
TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 26, 2020 | 8:44 PM

Sudigali Sudheer news: ఓ ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమవుతోన్న జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2013లో ప్రారంభమైన ఈ షో 7 సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతోంది. ఈ షోను చూసి పలు ఛానెళ్లు ఇలాంటి తరహా షోలను పెట్టినప్పటికీ.. అవేవి జబర్దస్త్‌ని ఢీ కొట్టలేకపోయాయి. ఇక ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి ఇందులో ఉంటూ అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తూ వస్తున్నారు సుడిగాలి సుధీర్‌. మొదట్లో వేణు వండర్స్‌లో ఉన్న సుధీర్‌.. ఆ తరువాత టీమ్‌ లీడర్ స్థాయికి ఎదిగారు. ఇక ఇప్పుడు సుధీర్ టీమ్‌ (ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను, సన్నీ)‌ సక్సెస్‌ఫుల్‌గా పేరు సాధించింది. ఎంతలా అంటే ఈ టీమ్‌లో ఎవరు లేకపోయినా ప్రేక్షకులకు ఏదో లోటు ఉన్నట్లు ఉంటోంది.

ఇది పక్కనపెడితే సుడిగాలి సుధీర్‌కి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే సుధీర్ ఇక జబర్దస్త్‌లో కనిపించడని. దీంతో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అయితే అసలు విషయంలోకి వెళ్తే.. జబర్దస్త్‌తో పాటు పలు షోలు చేస్తోన్న సుధీర్ అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నారు. ఇక ఇటీవల ఓ సినిమాను ఒప్పుకోగా.. అందులో నటించేందుకు సుధీర్‌ షోకు దూరం కానున్నాడట. ఆ షూటింగ్ తరువాత 15 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని నిర్ణయం తీసుకున్నాడట. ఈ క్రమంలో ‌రెండు, మూడు వారాల పాటు సుధీర్‌, షోకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత యథావిథిగా ఆయన ఈ షోలో పాల్గొనబోతున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియాలి.

Read More:

అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో అగ్ని ప్రమాదం

సెంట్రల్ జైలు నుంచి కొల్లు రవీంద్ర విడుదల

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu