వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్ కి కోవిడ్ 19 పాజిటివ్
అమెరికాలో వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్ కి కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. చాలావరకు బహిరంగ కార్యక్రమాల్లో మాస్క్ లేకుండా కనిపించిన ఈయన ఈ వైరస్ కి గురయ్యాడు.
అమెరికాలో వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్ కి కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. చాలావరకు బహిరంగ కార్యక్రమాల్లో మాస్క్ లేకుండా కనిపించిన ఈయన ఈ వైరస్ కి గురయ్యాడు. ఈ అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రచార సంబంధ ర్యాలీల్లో మెడోస్ ఆయన వెంటే ఉంటూ వచ్చారు. ట్రంప్ కి ఈయన టాప్ అడ్వైజర్ కూడా ! ట్రంప్ ప్రచార సారథుల్లో మరో ప్రముఖుడైన నిక్ ట్రెయినర్ కూడా కోవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఇద్దరూ సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకు అమెరికాలో కరోనా వైరస్ కి గురై రెండు లక్షల 40 వేళా మందికి పైగా మృత్యుబాట పట్టారు.