బిల్డింగ్ ‌పై నుంచి నోట్లకట్టల వర్షం..!

సడన్‌గా బిల్డింగ్‌ పై నుంచి నోట్ల కట్టల వర్షం పడితే ఎలా ఉంటుంది..? ఆ ఊహనే.. వేరు కదా..! కానీ.. అలాంటి సీనే.. పశ్చిమబెంగాల్‌లో రిపీట్ అయ్యింది. ఏదో సినిమాలో చూస్తున్నట్టు.. ఒక్కసారిగా.. ఓ బిల్డింగ్ పై నుంచి నోట్ల వర్షం కురిసింది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఓ భవనం నుంచి బుధవారం మధ్యాహ్నం.. నోట్ల వర్షం కురిసింది. అంతస్తు నుంచి కిందపడుతోన్న నోట్లను పట్టుకునేందుకు జనం ఎగబడ్డారు. ముందు పడుతోన్న నోట్లను చూసి […]

  • Updated On - 1:53 pm, Thu, 21 November 19 Edited By:
బిల్డింగ్ ‌పై నుంచి నోట్లకట్టల వర్షం..!

సడన్‌గా బిల్డింగ్‌ పై నుంచి నోట్ల కట్టల వర్షం పడితే ఎలా ఉంటుంది..? ఆ ఊహనే.. వేరు కదా..! కానీ.. అలాంటి సీనే.. పశ్చిమబెంగాల్‌లో రిపీట్ అయ్యింది. ఏదో సినిమాలో చూస్తున్నట్టు.. ఒక్కసారిగా.. ఓ బిల్డింగ్ పై నుంచి నోట్ల వర్షం కురిసింది.

వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఓ భవనం నుంచి బుధవారం మధ్యాహ్నం.. నోట్ల వర్షం కురిసింది. అంతస్తు నుంచి కిందపడుతోన్న నోట్లను పట్టుకునేందుకు జనం ఎగబడ్డారు. ముందు పడుతోన్న నోట్లను చూసి షాక్‌ అయిన జనాలు.. కాసేపటికే తేరుకుని.. నోట్లను ఒడిసి పట్టుకున్నారు. కిందపడిన నోట్లలో… రూ.2 వేలు, రూ.500, రూ.100 నోట్లు ఉన్నాయి.

బెంటిక్ స్ట్రీట్‌లోని ఓ భవనంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దాడులు జరిపారు. ఈ సమాచారం అందుకున్న హూఖ్ మెర్కంటైల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సిబ్బంది.. ఆరో అంతస్తులోని కిటికీ నుంచి నోట్ల కట్టలను కిందికి విసిరేశారు. అది నల్లధనం కాబట్టి.. అధికారులు పట్టుకుంటే.. జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోనన్న భయంతో.. వారు అలా పైనుంచి డబ్బును విసిరేసి ఉండవచ్చని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.