Ghee and Jaggery: చలికాలంలో బెల్లం, నెయ్యి కలిపి తింటే అద్భుతమైన ప్రయోజనాలు.. డోంట్ మిస్ ఇట్
ఇవి మీ రోగనిరోధక వ్యవస్థకు మేలు చేస్తాయి. దీని వల్ల చలికాలంలో దగ్గు, జలుబు రాకుండా చేస్తుంది. బెల్లం కలిపిన నెయ్యి జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని పెంచుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నెయ్యిలో ఉండే కొవ్వు రక్తంలో చక్కెర స్థాయిని అకస్మాత్తుగా పెరగకుండా కంట్రోల్ చేస్తుంది.
చలికాలంలో శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. ఇందులో భాగంగా బెల్లం, నెయ్యి తీసుకోవటం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. నెయ్యిలో విటమిన్-కె, విటమిన్-ఎ, విటమిన్-డి, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బెల్లంలో ఐరన్, ఫైబర్, ఫోలేట్, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి.
బెల్లం, నెయ్యి కలిసి తినడం వల్ల ఆహారం ఈజీగా జీర్ణమవుతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం సమస్య కూడా తగ్గుతుంది. నెయ్యి మీ ప్రేగులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నవారికి నెయ్యి, బెల్లం కలిపి తీసుకోవటం వల్ల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంటుంది. బెల్లం, నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల శీతాకాలం చల్లని వాతావరణంలో మిమ్మల్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి. నెయ్యి, బెల్లం రెగ్యులర్‌గా తీసుకోవటం వల్ల శరీరంలోని వాత, పిత్త, కఫ వంటి దోషాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. శరీరం కేలరీలను వేగంగా బర్న్ చేస్తుంది.
ప్రతి రోజూ భోజనం తర్వాత నెయ్యి, బెల్లం తినడం వల్ల రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇందులో ఐరన్, మెగ్నీషియం, అనేక కొవ్వు ఆమ్లాలు కూడా ఉన్నాయి. ఇవి మీ రోగనిరోధక వ్యవస్థకు మేలు చేస్తాయి. దీని వల్ల చలికాలంలో దగ్గు, జలుబు రాకుండా చేస్తుంది. బెల్లం కలిపిన నెయ్యి జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని పెంచుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నెయ్యిలో ఉండే కొవ్వు రక్తంలో చక్కెర స్థాయిని అకస్మాత్తుగా పెరగకుండా కంట్రోల్ చేస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.