AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబుకి షాక్ ఇచ్చిన ఎస్పీ… అంతలోనే…!

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావు అరెస్టుపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  పశ్చిమగోదావరి జిల్లా పోలీసు వారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఏలూరు రేంజి డి ఐ జి శ్రీ ఏ.యస్. ఖాన్ తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యే అయిన చింతమనేని ప్రభాకర్ రావు పై ప్రజలు అనేక మార్లు ఆయన పదవిలో ఉన్న సమయంలో ఇచ్చిన కేసులలో కొంతమంది అధికారులు అలసత్వం వహించడం వలన కేసులలో పురోగతి లేకుండా ఉండిపోయాయి, […]

చంద్రబాబుకి షాక్ ఇచ్చిన ఎస్పీ... అంతలోనే...!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 06, 2019 | 7:08 AM

Share

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావు అరెస్టుపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  పశ్చిమగోదావరి జిల్లా పోలీసు వారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఏలూరు రేంజి డి ఐ జి శ్రీ ఏ.యస్. ఖాన్ తీవ్రంగా ఖండించారు.

మాజీ ఎమ్మెల్యే అయిన చింతమనేని ప్రభాకర్ రావు పై ప్రజలు అనేక మార్లు ఆయన పదవిలో ఉన్న సమయంలో ఇచ్చిన కేసులలో కొంతమంది అధికారులు అలసత్వం వహించడం వలన కేసులలో పురోగతి లేకుండా ఉండిపోయాయి, సదరు కేసులలో అలసత్వం వహించే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు, మరియు ఈ మధ్యకాలంలో ప్రభాకర్ రావు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తుల పై చేసిన దౌర్జన్యాలపై నమోదు కాబడిన కేసులలో పోలీసు వారు చట్ట ప్రకారం చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ చేయడం జరిగింది. సదరు కేసుల్లో చింతమనేని ప్రభాకర్ రావు అతని యొక్క అనుచరులు తో చేసిన దౌర్జన్యకాండ పై ఉన్న కేసులలో మాత్రమే చింతమనేనిని అరెస్ట్ చేయడం జరిగింది తప్ప పోలీసు వారు ప్రభాకర్ పై ఏ విధమైన తప్పుడు కేసులు నమోదు పరచలేదు.

  • 63 కేసులు టి.డి.పి వారు అధికారంలో ఉండగా చింతమనేని ప్రభాకర్ రావు అభియోగాలు రాగా రిజిష్టర్ చేసినవి సదరు కేసులలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతూ సదరు కేసులో విచారణ అధికారులు మేనేజ్ చేసి సదరు కేసులనుండి చింతమనేని ప్రభాకర్ రావు యొక్క పేరును తప్పించి నారు.
  • చింతమనేని ప్రభాకర్ రావు తన యొక్క రాజకీయ పలుకుబడితో అధికారుల పైన, కాలేజీలో యొక్క యాజమాన్యం పైన, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వచ్చిన సమాచారంపై పెదవేగి మండలము లో ఉన్న పోలవరం గట్టు పైన కొంతమంది వ్యక్తులు మట్టి పట్టుకొని పోతున్నట్లుగా రాబడిన సమాచారం పై విజిలెన్స్ సి. ఐ మరియు అధికారులు అక్కడికి వెళ్ళగా అక్కడ చింతమనేని ప్రభాకర్ రావు వచ్చి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పై దౌర్జన్యం చేసినట్టుగా సి. ఐ ఇచ్చిన రిపోర్టులో తన పేరు లేకుండా రాజకీయ పలుకుబడి ఉపయోగించినట్లు, ఫారెస్ట్ పోలీస్ అధికారుల పైనా మరియు మహిళల పట్ల అసభ్యకర పదజాలంతో వేధింపులకు గురి చేసిన కేసులను మరియు అధికారుల పట్ల దౌర్జన్యతో కూడినటువంటి చర్యలతో పబ్లిక్ ప్రదేశాలలో గతంలో మెడికల్ ఆఫీసర్, ఫారెస్ట్ అధికారుల పైన, పోలీస్ అధికారుల పైన, డిస్ట్రిక్ట్ పంచాయితీ అధికారి పైన,ఏవో మరియు సెక్రెటరీ సి ఆర్ ఆర్ కాలేజీ యాజమాన్యం పైన, పత్రికా ప్రతినిధులు పైన, రెవిన్యూ అధికారులు పైన,మైనింగ్ డిపార్ట్మెంట్ వారి పైన మరియు ఎమ్మార్వో ముసునూరు వారి పైన దాడులు మరియు బూతులు తిడుతూ భౌతిక దాడులకు పాల్పడుతూన్న కేసులలో ఎఫ్ఐఆర్ లో చింతమనేని ప్రభాకర్ రావు పై చర్యలు లేకుండా తన యొక్క రాజకీయ పలుకుబడిని ఉపయోగించి నట్లు.
  • చింతమనేని ప్రభాకర్ రావు ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు కొంత మంది బయటికి వచ్చి గతంలో చింతమనేని ప్రభాకర్ రావు వలన బాధలు అనుభవించినటువంటి బాధితులు చింతమనేని ప్రభాకర్ పై కేసులు పెట్టారు.
  • ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యక్షముగా చింతమనేని ప్రభాకర్ రావు పాల్పడిన దౌర్జన్యకాండ లను గురించి కేవలం రెండు కేసులు మాత్రమే రిజిస్టర్ చేయబడినవి.
  • చింతమనేని ప్రభాకర్ పై రౌడీషీట్లు గత ప్రభుత్వ కాలమునుండి ఉన్నది అది ఇప్పటికీ ఏలూరు 3 టౌన్ పి.యస్ లో అమలులో ఉన్నది.
  • చింతమనేని ప్రభాకర్ రావు అనేక రకములైన ఇసుక మట్టి దోపిడీలు చేస్తూ తన యొక్క కనుసన్నలలో కోడి పందెములు పేకాట జూదం నిర్వహించినట్లు వాటి నివారణ కొరకు చర్యలు తీసుకునే అధికారులను తన యొక్క రాజకీయ పలుకుబడితో బెదిరిం చే వారు.
  • చింతమనేని ప్రభాకర్ రావు ను అరెస్టు చేసే సమయంలో మహిళా పోలీసు అధికారులపై అతని యొక్క అనుచరులు చేసిన దౌర్జన్యకాండ లు, మరియు చింతమనేని ప్రభాకర్ రావు ఏలూరు కేంద్ర కారాగారం నుండి కోర్టు నందు హాజరు సమయంలో ప్రభాకర్ రావు పోలీస్ అధికారుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసు అధికారులు సౌమ్య మానం తో వ్యవహరించారు తప్ప మరి ఏ విధముగా వ్యవహరించలేదు.
  • పెదపాడు మండలం ఏపూరు గ్రామానికి చెందిన కోసనం వెంకటరత్నం కి చెందిన ఇంటి సరిహద్దు సమస్యపై ఇంటి ప్రక్కన ఉన్న మహబూబాబ తో ఉన్న గొడవలను పురస్కరించుకుని, చింతమనేని ప్రభాకర్ రావు తన ఇంటి లో వెంకటరత్నం అని నిర్బంధించి అతన్ని చిత్రహింసలకు గురిచేసి కులం పేరుతో తిట్టినటువంటి విషయంపై పెదపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు పరచినారు.
  • పినకడిమి గ్రామానికి చెందిన జోసఫ్ అనే అతను కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు తన ఇంటి అవసరం నిమిత్తము గా తమ్మిలేరు వాగు నందు ఇసుకను తీసుకొని వచ్చుచుండగా చింతమనేని ప్రభాకర్ రావు మరియు అతని యొక్క అనుచరులు మారణాయుధాలతో అడ్డగించి కొట్టి గాయపరిచి నట్లు సదరు విషయమై పెదవేగి పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు పరచినారు. ఈ సమాజంలో పోలీసు వారు ఉన్నది ప్రజల యొక్క ప్రాణ మాన, ధన, ఆస్తి రక్షణ కొరకు మాత్రమే, పోలీసువారికి ఎవరి పైనా కక్షలు గని కార్పణ్యాలు గాని ఉండవు అని ఎస్పీ గారి తెలియపరుస్తూ, చింతమనేని ప్రభాకర్ పై ఉన్న కేసులలో పోలీసు వారు చట్ట ప్రకారం పని చేస్తారు అంతేగాని ఎవరి ప్రోద్బలంతో గాని అన్యాయంగా గాని, ఎవరి పైన కేసులు నమోదు చేయరు. సమాజంలో భాద్యత గల వ్యక్తులు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం వలన పోలీసు వారి యొక్క మనోధైర్యం సన్నగిల్లుతది, సదరు వ్యాఖ్యల వలన ప్రజలకు పోలీసు వారి పై తప్పుడు సంకేతాలు ఇచ్చిన వారవుతారని, చట్టం ముందు అందరూ సమానులే అంతేగాని రాజకీయ నాయకులకు ఏ విధమైన మినహాయింపులు ఉండవు అని, పోలీసు అధికారులు చట్ట ప్రకారంగా నడుచుకుంటారని అంతేగాని మరి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోరు అటువంటి సందర్భాల్లో ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా నడుచుకుంటే సదరు అధికారులపై, ఉన్నత అధికారులు చర్యలు తీసుకుంటారు అని, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వలన ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, సమాజంలో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, భయ పక్షపాత లకు లోనుకాకుండా విద్యుత్ ధర్మం నిర్వహిస్తామని ఈ పత్రికా ప్రకటన ద్వారా డి. ఐ. జి గారు తెలియజేసినారు.