AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమ్మెపై ముగిసిన డెడ్‌లైన్.. తేలనున్న ఆర్టీసీ కార్మికుల భవితవ్యం?

ప్రభుత్వ అల్టిమేటం పట్టలేదు. విధుల్లో చేరలేదు. మొండిపట్టు మీదున్నాయి తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు. అక్టోబర్‌ 5వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామన్న కార్మిక సంఘాలు.. బస్సులను డిపోలకే పరిమితం చేశాయి. శనివారం సాయంత్రం 6 గంటల వరకు కార్మికులకు సమయమిస్తామన్న ప్రభుత్వం.. అప్పటి వరకు విధుల్లోకి రాని వారికి ఉద్యోగం ఉండదని స్పష్టం చేసింది. ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సర్కారు ఆదివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించబోతుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతో పాటు.. 26 డిమాండ్లను […]

సమ్మెపై ముగిసిన డెడ్‌లైన్.. తేలనున్న ఆర్టీసీ కార్మికుల భవితవ్యం?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 06, 2019 | 5:36 AM

Share

ప్రభుత్వ అల్టిమేటం పట్టలేదు. విధుల్లో చేరలేదు. మొండిపట్టు మీదున్నాయి తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు. అక్టోబర్‌ 5వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామన్న కార్మిక సంఘాలు.. బస్సులను డిపోలకే పరిమితం చేశాయి. శనివారం సాయంత్రం 6 గంటల వరకు కార్మికులకు సమయమిస్తామన్న ప్రభుత్వం.. అప్పటి వరకు విధుల్లోకి రాని వారికి ఉద్యోగం ఉండదని స్పష్టం చేసింది. ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సర్కారు ఆదివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించబోతుంది.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతో పాటు.. 26 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచిన తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు.. మొదటి రోజు సమ్మె కొనసాగించాయి. సాయంత్రం ఆరు గంటల లోపు విధుల్లో చేరని వారికి ఉద్యోగం ఉండదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ స్పష్టం చేసినా.. ఉద్యోగులు పట్టించుకోలేదు. మరోవైపు.. ఆర్టీసీ సమ్మెపై ఆదివారం మధ్యాహ్నం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సీఎం ఆధ్వర్యంలో రవాణా, ఆర్టీసీ, పోలీస్‌ అధికారులు భేటీకానున్నారు. ఈ చర్చల్లో… ఆర్టీసీ భవితవ్యంపై తేల్చనుంది ప్రభుత్వం.

ప్రయాణికులకు అసౌకర్యం కల్పించడం జేఏసీ ఉద్దేశం కాదంటున్న కార్మిక సంఘాల నేతలు.. సెప్టెంబర్‌లోనే సమ్మె నోటీస్‌ ఇచ్చామని చెబుతున్నారు. దసరా వచ్చే వరకు ప్రభుత్వం తమతో చర్చలు జరపలేదని స్పష్టం చేస్తున్నారు. యూనియన్లపై నిందలు వేయడం సరికాదంటున్నారు. ఆదివారం అన్ని రాజకీయ పార్టీల ట్రేడ్‌ యూనియన్లు, విద్యార్థి సంఘాల మద్దతు కోరుతూ లేఖలు ఇవ్వనున్నట్లు జేఏసీ నేత రాజారెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటలకు ట్రేడ్‌ యూనియన్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించబోతున్నట్లు చెప్పారు. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన అందాల్సిన వేతనాలు ఇంకా అందలేదు. ఆర్థిక పరిస్థితి కారణంగా ఐదో తేదీన జీతాలు చెల్లిస్తున్నారు. అయితే కార్మికుల ఖాతాల్లో ఇంతవరకు జీతాలు పడలేదు. సమ్మె నేపథ్యంలో జీతాల చెల్లింపుపై ఉత్కంఠ నెలకొంది.

ఇదిలా ఉంటే కార్మికులు సమ్మెను కొనసాగిస్తుండటంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. తాత్కాలికంగా 6 వేల నియామకాలు చేపట్టారు. చేపట్టింది. 4 వేల మంది డ్రైవర్లు, 2 వేల మంది కండక్టర్ల నియమించారు. ఆదివారం నుంచి పూర్తిస్థాయిలో బస్సుల్ని నడపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక శనివారం ఉదయం నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 9వెల బస్సులు తిరిగాయని అధికారులు తెలిపారు. టీఎస్ ఆర్టీసీ బస్సులు- 2129, అద్దె బస్సులు 1717, ప్రైవేట్ బస్సులు 1155 నడిపామన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి 1195, మ్యాక్సీ క్యాబ్‌తో పాటు ఇతర వాహనాలు 2778 నడిచాయి.