AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెల్లూరు ఘటనపై సీఎం సీరియస్.. ఎమ్మెల్యే అరెస్ట్‌కు రంగం సిద్ధం?

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అరెస్ట్‌కు ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్లు సమాచారం. వెంకటాచలం ఎంపీడీవోతో కోటంరెడ్డి వివాదంపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారట. ఢిల్లీ నుంచి తిరిగి రాగానే ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారట. డీజీపీ గౌతం సవాంగ్ సీఎంకు వివరాలు నివేదించారట. చట్టాన్ని ధిక్కరించే వారు ఎవరైనా ఉపేక్షించొద్దన్న ముఖ్యమంత్రి.. చట్ట ప్రకారం ఏ చర్యకైనా వెనకాడొద్దని డీజీపీకి చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ కూడా […]

నెల్లూరు ఘటనపై సీఎం సీరియస్.. ఎమ్మెల్యే అరెస్ట్‌కు రంగం సిద్ధం?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 06, 2019 | 8:35 AM

Share

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అరెస్ట్‌కు ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్లు సమాచారం. వెంకటాచలం ఎంపీడీవోతో కోటంరెడ్డి వివాదంపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారట. ఢిల్లీ నుంచి తిరిగి రాగానే ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారట. డీజీపీ గౌతం సవాంగ్ సీఎంకు వివరాలు నివేదించారట.

చట్టాన్ని ధిక్కరించే వారు ఎవరైనా ఉపేక్షించొద్దన్న ముఖ్యమంత్రి.. చట్ట ప్రకారం ఏ చర్యకైనా వెనకాడొద్దని డీజీపీకి చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ కూడా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై చర్యలకు పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పోలీసులు అరెస్ట్‌కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎంపీడీవో ఫిర్యాదుతో ఇప్పటికే ఎమ్మెల్యేతో పాటూ మరో అనుచరుడిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

ఎమ్మెల్యే కోటంరెడ్డి తనపై దౌర్జ్యనం చేసి బెదిరించారని నెల్లూరు జిల్లా వెంకటాచలం మహిళా ఎంపీడీవో పోలీస్ స్టేషన్ ముందు అర్ధరాత్రి దీక్ష చేశారు. తన అనుచరుడుకి పంచాయితీ కుళాయి కనెక్షన్‌ ఇవ్వాలని కోటం రెడ్డి అడిగారని.. ఆ విషయం పరిశీలిస్తానని తాను చెప్పినా ఫోన్‌లో బెదిరించారన్నారు. కల్లూరిపల్లిలోని తన ఇంటికి శుక్రవారం రాత్రి మద్యం సేవించి అనుచరులతో కలిసి కోటంరెడ్డి వచ్చి దౌర్జన్యానికి దిగారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అతని అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌‌మోహన్ రెడ్డి తమకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

Follow Us
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు.. జస్ట్ 32 నెలల్లో
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు.. జస్ట్ 32 నెలల్లో
గ్రహాల నీచత్వం.. వీరికి అధికార యోగం, ఆకస్మిక ధనలాభం..!
గ్రహాల నీచత్వం.. వీరికి అధికార యోగం, ఆకస్మిక ధనలాభం..!
ఇండస్ట్రీలోనే తిరుగులేని హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
ఇండస్ట్రీలోనే తిరుగులేని హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఫోన్ల నిషేధం...
ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఫోన్ల నిషేధం...
రోహిత్ షాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే
రోహిత్ షాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే
కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..
కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..
నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!
నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!
కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?
కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?
నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..
నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..
విజయ్-రష్మికల గొప్ప మనసు.. ఏకంగా 400 కుటుంబాలకు ఏడాది పాటు..
విజయ్-రష్మికల గొప్ప మనసు.. ఏకంగా 400 కుటుంబాలకు ఏడాది పాటు..