తెలుగురాష్ట్రాలకు వర్ష సూచన.. వచ్చే నాలుగురోజుల పాటు వర్షాలు

తెలుగు రాష్ర్టాలకు మళ్లీ వానల గుబులు పట్టుకుంది. మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది మంగళవారం నాటికి మరింత బలపడొచ్చు. మరోవైపు, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ రెండింటి ప్రభావంతో హైదరాబాద్ తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణశాఖ తెలిపింది. ఆదివారం ఓ మోస్తరు […]

తెలుగురాష్ట్రాలకు వర్ష సూచన.. వచ్చే నాలుగురోజుల పాటు వర్షాలు
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 18, 2020 | 2:41 PM

తెలుగు రాష్ర్టాలకు మళ్లీ వానల గుబులు పట్టుకుంది. మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది మంగళవారం నాటికి మరింత బలపడొచ్చు. మరోవైపు, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ రెండింటి ప్రభావంతో హైదరాబాద్ తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణశాఖ తెలిపింది. ఆదివారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, సోమవారం భారీ వర్షాలు పడుతాయని చెప్పారు. ప్రధానంగా మంగళ, బుధవారాల్లో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీనుంచి అతిభారీ వర్షాలు కురువొచ్చని వెల్లడించారు. వర్షాలు మళ్లీ పుంజుకోనున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పారు.